ETV Bharat / international

కమలా హారిస్​కు మైక్​ పెన్స్​ అభినందనలు

author img

By

Published : Jan 16, 2021, 9:32 AM IST

అమెరికా ఉపాధ్యక్షుడు మైక్​ పెన్స్​.. తన స్థానంలో త్వరలో పదవీ చేపట్టనున్న కమలా హారిస్​కు ఫోన్​ చేసి అభినందించారు. క్యాపిటల్​ దాడి అనంతరం కీలక నేతలు ఇద్దరి మధ్య జరిగిన సంభాషణ రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.

Mike Pence calls Kamala Harris
కమలా హారిస్​కు ఫోన్​లో.. మైక్​ పెన్స్​ అభినందనలు

​త్వరలో అమెరికా ఉపాధ్యక్ష పదవీ చేపట్టనున్న కమలా హారిస్​ను.. ప్రస్తుత ఉపాధ్యక్షుడు మైక్స్​ పెన్స్ అభినందించారు. ఈ మేరకు ఫోన్​చేసి ఆమెతో పెన్స్​ మాట్లాడారు. గురువారం మధ్యాహ్నం వీరిరువురి మధ్య సంభాషణ జరిగినట్లు సంబంధిత అధికారి ఒకరు తెలిపారు. క్యాపిటల్​ భవనంపై దాడి అనంతరం కమల, బైడెన్​ల మధ్య జరిగిన ఈ నేతల ఫోన్​ సంభాషణ.. రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.

అధ్యక్ష ఎన్నికల తర్వాత.. అమెరికా ప్రస్తుత పాలకులు, ఎన్నికైన నేతలకు మధ్య జరిగిన మొదటి సంభాషణ ఇదే కావడం గమనార్హం. అధ్యక్షుడిగా ట్రంప్​ ఓటమి ధ్రువీకరణ అనంతరం నుంచి పలు కీలక బాధ్యతలను ఉపాధ్యక్షుడు పెన్స్​ నిర్వర్తిస్తున్నారు. క్యాపిటల్​ దాడి ఘటనను అదుపు చేసిన భద్రతా సిబ్బందిని ఆయనే ప్రశంసించారు. నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరవుతానని పెన్స్​ ప్రకటించారు. మరో వైపు బైడెన్​ విజయాన్ని పదపదే ప్రశ్నిస్తున్న అధ్యక్షుడు ట్రంప్​.. ఈ కార్యక్రమానికి తాను హాజరు కానని ఇదివరకే స్పష్టం చేశారు.​ జనవరి 20న బైడెన్​, కమలా హారిస్​ ప్రమాణం చేయనున్నారు.

ఇదీ చూడండి:బైడెన్​ ప్రమాణస్వీకారం రోజే శ్వేతసౌధం వీడనున్న ట్రంప్!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.