ETV Bharat / international

మానవ కణజాలాల్లోనూ ప్లాస్టిక్ అవశేషాలు

ప్రపంచంలోనే అతి పెద్ద సమస్యగా మారింది ప్లాస్టిక్​. ఇప్పటి వరకు జంతువుల్లో కనిపించిన దీని అవశేషాలు... మానవ కణజాలంలోనూ ఉన్నాయని అమెరికా శాస్త్రవేత్తలు తేల్చి చెప్పారు. మెదడు, ఇతర శరీర అవయవాల నుంచి సేకరించిన నమూనాలను పరిశీలించగా వాటిల్లో ఉన్నట్లు గుర్తించారు.

Micro- and nanoplastics detectable in human tissues
మానవ కణజాలాల్లోనూ ప్లాస్టిక్ అవశేషాలు
author img

By

Published : Aug 18, 2020, 9:27 AM IST

ప్లాస్టిక్​ కాలుష్యం పుడమిని ముంచేస్తోంది. ఇది నేల, నీరు, నింగిలో సమస్యగా మారింది. వాటి అవశేషాలు జంతువుల్లోకి చేరాయని ఇప్పటికే వెల్లడైంది. అయితే మానవ కణజాలంలో కూడా అవి ఉన్నాయని అమెరికా శాస్త్రవేత్తలు తేల్చారు. ప్లాస్టిక్​లు విచ్ఛిన్నమై, చిన్న చిన్న రేణువులుగా మారుతుంటాయి. 5 మిల్లీమీటర్ల కన్నా చిన్నావైన రేణువులను నానోప్లాస్టిక్స్​గా పిలుస్తారు. ఈ రెండు రకాల వ్యర్థాల వల్ల ఫలదీకరణ సమస్యలు, ఇన్​ఫ్లమేషన్​, క్యాన్సర్​ వంటి సమస్యలు తలెత్తవచ్చని జంతువులపై జరిపిన పరిశోధనల్లో వెల్లడైంది. ఈ రేణువులు మానవుల జీర్ణాశయం గుండా బయటకు వెళ్లిపోతాయని మునుపటి అధ్యయనాల్లో తేలింది. అయితే ఆరిజోనా విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు మాత్రం. అవి మానవుల్లో పేరుకుపోవచ్చని అనుమానించారు.

నాడీ క్షీణత వ్యాధులపై అధ్యయనం కోసం భారీగా మెదడు, ఇతర శరీర అవయవాల నుంచి సేకరించిన నమూనాలను వారు పరిశీలించారు. వీటి నుంచి ప్లాస్టిక్​ పదార్థాలను వెలికితీసి, విశ్లేషించడానికి రామన్​ స్పక్ట్రోమెట్రీ ద్వారా ఒక విధానాన్ని అభివృద్ధి చేశారు. ఆ ప్లాస్టిక్​ రేణువులను బరువు, వెడల్పుపై లెక్కలు కట్టడానికి కంప్యూటర్​ సాఫ్ట్​వేర్​ను కూడా సిద్ధం చేశారు. ఊపిరితిత్తులు, కాలేయం, ప్లీహం, మూత్ర పిండాలకు సంబంధించిన అన్ని నమూనాల్లో ప్లాస్టిక్​ అవశేషాలు ఉన్నట్లు గుర్తించారు.

ఇదీ చూడండి:సామాజిక మరుగుదొడ్లు వాడే వారిలో 62శాతం మందికి కరోనా

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.