జీవితం ఎప్పుడు ఏ విధంగా మలుపు తిరుగుతుందో ఎవరూ ఊహించలేరు. కోటీశ్వరులు ఒక్క రోజులో అన్నీ కోల్పోతే, అసలేమీ లేని వాళ్లు ధనికులైన సంఘటనలు ఎన్నో! తాజాగా.. ఓ వ్యక్తి జీవితంలోనూ ఇదే జరిగింది. అతడు ఒక్కరోజులో లక్షాధికారి అయిపోయాడు. అందుకు కారణం ఓ 'ఏటీఎం'.
మీడియా కథనాల ప్రకారం.. ఓ వ్యక్తి 300డాలర్లు(రూ. 22,360) ఖర్చు పెట్టి జంక్యార్డు నుంచి ఓ ఏటీఎంను కొనుగోలు చేశాడు. అది అమ్మిన వ్యక్తి దానికి సంబంధించిన కీ ఇవ్వలేదు. దీంతో ఏటీఎంను కొనుగోలు చేసిన వ్యక్తి.. తన సహచరుడి సహాయంతో దాన్ని బద్దలుకొట్టాడు.
అందులో నోట్ల కట్టలు అందులో దర్శనమిచ్చాయి. మొత్తంగా 2వేల డాలర్లు(రూ. 1.5లక్షలు) బయటపడ్డాయి. అవి చూసి ఆ వ్యక్తి ఆనందంలో మునిగిపోయాడు.
ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ఇంటర్నెట్లో షేర్ చాశాడు. సామాజిక మాధ్యమాల్లో ఆ వీడియో వైరల్గా మారింది. వీక్షకులు వీడియోను విపరీతంగా లైక్ చేస్తున్నారు, కామెంట్లు పెడుతున్నారు.
అయితే.. ఈ ఘటన ఎప్పుడు, ఎక్కడ జరిగిందన్న వివరాలు తెలియలేదు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇదీ చూడండి:- లాటరీ టికెట్ కొని మర్చిపోయిన మెకానిక్.. కొద్దిరోజులకు కోటీశ్వరుడై...