కరోనా వైరస్ ఉద్ధృతి కొనసాగుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 3,23,94,957మందికి వైరస్ సోకింది. 9,87,066మంది వైరస్ ధాటికి బలయ్యారు. అమెరికా, ఐరోపాలో తీవ్రత మళ్లీ పెరుగుతోంది.
బ్రిటన్లో...
బ్రిటన్లో పరిస్థితులు మళ్లీ మొదటికి వచ్చాయి. రోజువారీ కేసుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా 6వేలకుపైగా కేసులు నమోదయ్యాయి.
వైరస్ విజృంభణపై వైద్య నిపుణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత అనుభవాల నుంచి బ్రిటన్ పాఠాలు నేర్చుకోలేదని విమర్శిస్తున్నారు. దేశంలో ఇప్పటివరకు 4,16,363 కేసులు వెలుగుచూశాయి. 41,902మంది మరణించారు.
ప్రపంచ దేశాల పరిస్థితి ఇలా...
దేశం | కేసులు | మృతులు |
అమెరికా | 71,84,980 | 207,516 |
బ్రెజిల్ | 46,59,909 | 1,39,883 |
రష్యా | 11,28,836 | 19,948 |
కొలంబియా | 7,90,823 | 24,924 |
పెరూ | 7,82,695 | 31,870 |
మెక్సికో | 7,10,049 | 74,949 |
స్పెయిన్ | 7,04,209 | 31,118 |
అర్జెంటీనా | 6,78,266 | 14,766 |
దక్షిణాఫ్రికా | 6,67,049 | 16,283 |
ఇదీ చూడండి:- 2021కల్లా చైనా 'కరోనా వ్యాక్సిన్'!