ETV Bharat / international

వైరస్​ నుంచి రక్షణకు 'సింగిల్​ డోస్' వ్యాక్సిన్​

కరోనా వైరస్‌ను ఎదుర్కొనే వ్యాక్సిన్‌ కోసం ప్రపంచవ్యాప్తంగా ముమ్మర పరిశోధనలు జరుగుతున్నాయి. రష్యా, చైనాలో ఇప్పటికే వ్యాక్సిన్​ అందుబాటులోకి వచ్చింది. మరికొన్ని దేశాల్లో క్లినికల్​ ట్రయల్స్​ చివరి దశకు చేరాయి. ఈ వరుసలోనే జాన్సన్ అండ్​ జాన్సన్‌ భారీస్థాయిలో మూడో దశ ప్రయోగాలు ప్రారంభించింది. పలు దేశాల్లో దాదాపు 60 వేల మందిపై దీన్ని ప్రయోగించనున్నారు.

Late-stage study of first single-shot vaccine begins in US
వ్యాక్సిన్​ సింగిల్​ డోస్​ వైరస్​ నుంచి రక్షిస్తుందా?
author img

By

Published : Sep 23, 2020, 9:01 PM IST

కొవిడ్​-19ను ఎదుర్కొనేందుకు జాన్సన్​ అండ్​ జాన్సన్​ సంస్థ తయారుచేసిన వ్యాక్సిన్​ క్యాండిడేట్​.. అతి పెద్ద ప్రయోగం ప్రారంభమైంది. అమెరికా, దక్షిణాఫ్రికా, అర్జెంటినా, బ్రెజిల్​, చిలీ, కొలంబియా, మెక్సికో, పెరూ దేశాల్లోని దాదాపు 60 వేల వాలంటీర్లపై మూడో దశ క్లినికల్​ ట్రయల్స్​ ప్రారంభించింది. ఫలితంగా.. ప్రపంచంలోనే అతిపెద్ద కరోనా వైరస్​ వ్యాక్సిన్​ పరిశోధనగా ఇది ఘనత సాధించనుంది.

మిగతా వాటిల్లాగ కాకుండా జాన్సన్​ అండ్​ జాన్సన్​ వ్యాక్సిన్​ క్యాండిడేట్​ను విభిన్న సాంకేతిక పరిజ్ఞానంతో అభివృద్ధి చేశారు. దాదాపు ఇది ఎబోలా వ్యాక్సిన్​ నమూనాను పోలి ఉంటుంది. మిగతా టీకాలు రెండో డోసులు ప్రయోగిస్తుంటే.. జే&జే మాత్రం సింగిల్​ డోస్​ను మాత్రమే ప్రయోగిస్తోంది. సింగిల్​ షాట్​.. వైరస్​ నుంచి రక్షణ ఇస్తుందా? అనే దానిపై విస్తృతంగా పరిశోధనలు జరుగుతున్నాయి.

మరో రెండు టీకాలు...

అమెరికాలో ఇప్పటికే మోడెర్నా, ఫైజర్​ సంస్థలు తయారు చేసిన వ్యాక్సిన్​ క్యాండిడేట్లు చివరి దశ ప్రయోగాల్లో ఉన్నాయి. ఈ ఏడాది చివర్లోగా వీటిల్లో ఒక్క టీకా అయినా విడుదలయ్యే అవకాశాలున్నాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు వైద్య నిపుణులు.

కొన్ని కారణాల వల్ల ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్​ క్యాండిడేట్​ ట్రయల్స్​ అమెరికాలో ప్రస్తుతానికి నిలిచిపోయాయి. ప్రయోగాలకు అనుమతి ఇచ్చే ముందు అన్ని అంశాలను జాగ్రత్తగా పరిశీలించాలని అంటున్నారు అమెరికా వైద్యాధికారులు. అన్ని దశల్లో ప్రయోగాలు జరిపి కచ్చితమైన ఫలితాలు వస్తేనే వ్యాక్సిన్​ క్యాండిడేట్లను.. ప్రజా వినియోగానికి అనుమతించాలని సూచించారు.

ఈ నేపథ్యంలో టీకా సామర్థ్యాన్ని పూర్తిగా పరిశీలించాకే, సురక్షితం అని తేలాకే అందుబాటులోకి తీసుకొస్తామని స్పష్టం చేశారు జాతీయ ఆరోగ్య సంస్థ డైరెక్టర్​ డా. ప్రాన్సిస్​ కొలిన్స్​.

ఒకవేళ.. ఈ ఏడాది చివరికల్లా టీకా అత్యవసర వాడకం కోసం అమెరికా ఫుడ్​ అండ్​ డ్రగ్​ అడ్మినిస్ట్రేషన్(ఎఫ్​డీఏ)​ అనుమతించినా పంపిణీ పరిమితంగానే ఉండనుంది. ఆరోగ్య కార్యకర్తలకే తొలి ప్రాధాన్యం ఇవ్వనున్నారు. అమెరికన్లు అందరికీ వ్యాక్సిన్​ అందుబాటులోకి రావాలంటే మరో సంవత్సరం పట్టేలా ఉందని నిపుణులు భావిస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.