ETV Bharat / international

కరోనా వ్యాక్సిన్​ అభివృద్ధిలో ఆర్గనాయిడ్స్ కీలక పాత్ర! - Organoids may play key role in COVID-19 drug development:

కరోనా వైరస్​పై ప్రపంచవ్యాప్తంగా అనేక పరిశోధనలు జరుగుతున్నాయి. వీటి ద్వారా కొత్త కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. తాజాగా ల్యాబ్​లో అభివృద్ధి చేసిన టినీ (చిన్న) మానవ అవయవాలు.. కరోనా వైరస్​ వ్యాక్సిన్​ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తాయని తాజా అధ్యయనంలో పేర్కొన్నారు శాస్త్రవేత్తలు.

Lab-grown mini human organs may play key role in COVID-19 drug development: Scientists
ఆర్గనాయిడ్స్​పై పరిశోధనలతో కరోనా ఔషధాల అభివృద్ధి!
author img

By

Published : May 7, 2020, 3:47 PM IST

ల్యాబ్​లో అభివృద్ధి చేసిన చిన్నపాటి మానవ అవయవాలు.. కొవిడ్​-19 వ్యాక్సిన్​ అభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తాయని తెలిపారు శాస్త్రవేత్తలు. వీటిపై చేసే పరిశోధనల ఫలితాలతో కరోనా వైరస్​కు కొత్త తరహా చికిత్సను కనుగొనవచ్చని అభిప్రాయపడ్డారు.

ల్యాబ్​లో అభివృద్ధి చేసే అవయవాలకు ఆర్గనాయిడ్స్​ అని పేరు. ఇవి మనిషికి వ్యాధి సోకినప్పుడు ఉండే కణజాలాలను పోలి ఉంటాయి.

కరోనా వైరస్​ ఎలా వ్యాప్తిచెందుతుందో అర్థం చేసుకోవడానికి ఈ అవయవాలపై పరిశోధనలు జరుపుతున్నారు శాస్త్రవేత్తలు. ఈ విషయాన్ని కెనడాలోని బ్రిటీష్​ కొలంబియా విశ్వవిద్యాలయంలోని లైఫ్​ సైన్స్​ ఇన్​స్టిట్యూట్​​ డైరెక్టర్​ జోసెఫ్​ పెన్నిన్​జెర్​ తెలిపారు. మనిషి శరీరంలో ఉండే స్టెమ్​ సెల్స్​ నుంచి అభివృద్ధి చేసిన ఈ అవయవాల్లో.. మనిషిలో ఉన్న కణాల్లాగే, కొన్ని కణాలు ఉంటాయని పేర్కొన్నారు.

జికా వైరస్​ను అర్థం చేసుకోవడానికి శాస్త్రవేత్తలకు ఈ అవయవాలు ఎంతో ఉపయోగపడ్డాయి. తాజాగా కరోనా వైరస్​పైనా ఇవి ఉపయోగకరంగా ఉంటాయని వారు భావిస్తున్నారు. ఈ ఆర్గనాయిడ్స్​ సహాయంతో శాస్త్రవేత్తలు వైరస్​ను అర్థం చేసుకునే తీరు మారుతుందని అమెరికాలోని కార్నాల్​ విశ్వవిద్యాలయంలోని స్టెమ్​ సెల్​ బయాలజిస్ట్​ షూయిబింగ్​ చెన్​ తెలిపారు.

"అంటు వ్యాధులపై పరిశోధనలు చేయడానికి కోతి మూత్రపిండాల నుంచి కణాల(వెరో సెల్స్,కోలోన్​ క్యాన్సర్​ సెల్స్​​)ను తీసుకుంటారు. అయితే ఇవి మనిషిలో ఏం జరుగుతుందనే దాన్ని స్పష్టంగా చెప్పలేవు. సార్స్​-సీఓవీ2 గురించి ఎలుకపై కొందరు శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు. అయితే మనిషిలోకి సార్స్​-సీఓవీ2 ప్రవేశించడానికి కావాల్సిన రిసెప్టర్​ వీటిలో ఉండవు. ఇలాంటి పరిమితులను అధిగమించడానికి ఆర్గనాయిడ్స్​ సహాయపడతాయి. వైరస్​ను శాస్త్రవేత్తలు అర్థం చేసుకునే తీరును ఇవి మార్చగలుగుతాయి. ఫలితంగా కొత్త చికిత్సలు ఉత్పన్నమవుతాయి."

--- షూయిబింగ్​ చెన్​, కార్నాల్​ విశ్వవిద్యాలయం

ఈ ఆర్గనాయిడ్​పై చేపట్టిన ప్రయోగాల ద్వారా.. పేగులోని బయట పొరలో ఉన్న ఏ కణాలకు వైరస్​ సోకుతుందో గుర్తించవచ్చని ఈ అధ్యయనం సహ రచయిత జోప్​ బ్యూమర్​ తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.