ETV Bharat / international

'సెకెండ్​ జెంటిల్​మేన్​'గా హారిస్​ భర్త డగ్లస్​

author img

By

Published : Nov 9, 2020, 7:17 AM IST

అమెరికా ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన తొలి మహిళ కమలా హారిస్​కు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు దక్కుతున్నాయి. అయితే ఆమె భర్త డగ్లస్​ సైతం ఓ అరుదైన రికార్డు సొంతం చేసుకున్నారు.

Kamala Harris
సెకెండ్​ జెంటిల్​మేన్​గా డగ్లస్​..

అమెరికా ఉపాధ్యక్షురాలిగా కమలా హారిస్​​ ఎన్నికవడం వల్ల ఆమె భర్త డగ్లస్​ ఎమ్​హోఫ్​నకు.. 'సెకెండ్​ జెంటిల్​మేన్​' స్థానం కల్పించనున్నారు. న్యాయవాది అయిన డగ్లస్​(56).. అమెరికా తొలి 'సెకెండ్​ జెంటిల్​మేన్​'గా చరిత్రకెక్కనున్నారు. ఇదివరకు ఉపాధ్యక్షులుగా అందరూ పురుష అభ్యర్థులే ఎన్నికవడం వల్ల.. వారి భార్యలకు ద్వితీయ మహిళ హోదా ఇచ్చేవారు. కానీ అగ్రరాజ్య చరిత్రలోనే.. ఉపాధ్యక్ష పదవికి ఓ మహిళ ఎన్నికవడం ఇదే తొలిసారి కావడం వల్ల ఆమె భర్తకు సెకెండ్​ జెంటిల్​మేన్​ స్థానం కల్పించనున్నారు.

వచ్చే ఏడాది జనవరిలో ఉపాధ్యక్షురాలిగా కమలా హారిస్​ ప్రమాణం స్వీకారం చేసిన తరువాత ఆయనకు అధికారిక హోదా ఇవ్వనున్నారు. కమలా హారిస్​​, డగ్లస్​.. 2014లో వివాహం చేసుకున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.