తన ప్రెస్ సెక్రటరీగా ఇండో-అమెరికన్ సబ్రినా సింగ్‌ను నియమించుకున్నారు అమెరికా ఉపాధ్యక్ష పదవికి డెమొక్రాట్ల తరపున పోటీపడుతున్న కమలా హ్యారిస్. సబ్రినా సింగ్ ఇప్పటివరకు ఇద్దరు డెమొక్రాట్ అధ్యక్ష ఎన్నికల అభ్యర్థులకు ప్రతినిధిగా బాధ్యతలు నిర్వర్తించారు.
ఓ పెద్ద రాజకీయ పార్టీలోని ఉపాధ్యక్ష పదవికి పోటీపడుతున్న అభ్యర్థికి ప్రెస్ సెక్రటరీగా ఎంపికైన తొలి ఇండో-అమెరికన్‌గా సబీనా గుర్తింపు పొందారు.
37ఏళ్ల సబ్రినా సింగ్.. గతంలో డెమొక్రటిక్ నేషనల్ కమిటీ ప్రతినిధిగా పని చేశారు.
ఇదీ చూడండి:- అమెరికాలో వికసిస్తోన్న మన 'కమలం'...
అమెరికాలోని భారత సంతతి సంఘాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న "ఇండియా లీక్ ఆఫ్ అమెరికా" వ్యవస్థాపకుడు జే.జే సింగ్ మనవరాలు సబ్రినా సింగ్. అమెరికాలోని జాతి వివక్షకు వ్యతిరేకంగా 1940లో అనేక ప్రచారాలు నిర్వహించారు జే.జే సింగ్. వీటి ఫలితంగా.. దేశంలోకి ప్రతి ఏటా 100మంది భారతీయులు వలస వచ్చే విధంగా చట్టాన్ని అమలు చేశారు నాటి అధ్యక్షుడు హ్యారీ ట్రూమన్.
ఇవీ చూడండి:-