ETV Bharat / international

క్లైమాక్స్​కు 'అధ్యక్ష పోరు'- ట్రంప్​ ట్విస్ట్ ఇస్తారా? - ఎలక్టోరల్ కాలేజీ ఓట్లు కాంగ్రెస్

అత్యంత నాటకీయ పరిణామాల మధ్య అమెరికా కాంగ్రెస్ సంయుక్త సమావేశానికి రంగం సిద్ధమైంది. అధికారం నిలబెట్టుకునేందుకు ఎంతకైనా వెనకాడడని ఇప్పటికే తేల్చి చెప్పిన ట్రంప్.. ఫలితాలను మార్చేందుకు ఈ సమావేశాన్ని చివరి అవకాశంగా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో సమావేశంలో ఏం జరగనుంది? ఫలితాలపై అభ్యంతరాలు వ్యక్తమైతే పరిణామాలేంటి? అన్న విషయాలపై ఆసక్తి నెలకొంది.

Joint Session of US Congress set to formally certify Joe Biden's presidential victory
ట్రంప్ బైడెన్ అమెరికా కాంగ్రెస్
author img

By

Published : Jan 6, 2021, 4:50 PM IST

అమెరికా అధ్యక్ష ఎన్నికల ఘట్టానికి చివరి దశగా భావించే అమెరికా కాంగ్రెస్ సంయుక్త సమావేశం బుధవారం జరగనుంది. అధ్యక్షుడిని అధికారికంగా ఎన్నుకునే ఈ సమావేశంలో ఎలక్టోరల్ కాలేజీ ఓట్లను లెక్కించనున్నారు. ఈ నేపథ్యంలో బైడెన్ గెలుపును సవాల్ చేయాలన్న ప్రణాళికతో పలువురు రిపబ్లికన్లు సిద్ధమవుతున్నారు. కనీసం ఆరు రాష్ట్రాల్లో బైడెన్ విజయంపై సవాల్ చేయాలని భావిస్తున్నారు. ఎలక్టోరల్ ఓట్లు సహా, ఎన్నికల ఫలితాలపై అభ్యంతరం తెలపనున్నారు. మరోవైపు... అధికారికంగా బైడెన్ విజయాన్ని వ్యతిరేకించాలని ఉపాధ్యక్షుడు, సెనేట్ సభాధ్యక్షుడు మైక్ పెన్స్​ను డొనాల్డ్ ట్రంప్ కోరుతున్నారు.

ఈ పరిస్థితుల మధ్య కాంగ్రెస్ సమావేశం సాఫీగా జరిగే అవకాశం లేదని స్పష్టమవుతూనే ఉంది. రాత్రి వరకు సమావేశం కొనసాగొచ్చని తెలుస్తోంది.

ఇదీ చదవండి: ఎన్నికల మోసాలపై రిపబ్లికన్ పార్టీలో చీలికలు!

కాంగ్రెస్ సంయుక్త సమావేశంలో ఏం జరుగుతుంది?

అమెరికా ఫెడరల్ చట్టం ప్రకారం జనవరి 6న కాంగ్రెస్ తప్పనిసరిగా సమావేశమై ఎలక్టోరల్ ఓట్ల ఫలితాల ధ్రువీకరణ పత్రాలను పరిశీలించాలి. సీల్ చేసిన ఈ పత్రాలను ప్రత్యేకమైన మహోగని బాక్సులలో తీసుకొస్తారు. సభలోని రెండు ఛాంబర్లలో.. ఇరుపార్టీల ప్రతినిధులు, ఎలక్టోరల్ ఓట్లను లెక్కించి.. ఫలితాలను చదివి వినిపిస్తారు.

ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ సభకు అధ్యక్షత వహించి విజేత పేరును ప్రకటిస్తారు. అమెరికా కాలమానం ప్రకారం మధ్యాహ్నం ఒంటిగంటకు సమావేశం ప్రారంభమవుతుంది.

రాజ్యాంగంలో ప్రక్రియ ఎలా ఉంది?

ఎలక్టోరల్ ఓట్లను లెక్కించాలని అమెరికా రాజ్యాంగంలోనూ రాసి ఉంది. ఈ ఓట్లు ఇరు పార్టీల అభ్యర్థులకు సమానంగా వస్తే.. సభ్యులే అధ్యక్షుడిని ఎన్నుకుంటారు. ఒక్కొక్కరికి ఒక్కో ఓటు ఉంటుంది. అయితే 1800 సంవత్సరం తర్వాత ఫలితాలు ఎప్పుడూ టై కాలేదు. ఇప్పుడు కూడా ఈ అవకాశం లేదు. ట్రంప్​పై బైడెన్ 306-232 ఓట్ల తేడాతో ముందంజలో ఉన్నారు.

అభ్యంతరాలు ఉంటే ఏం చేస్తారు?

ఎలక్టోరల్ ఓట్లను చదివి వినిపించేటప్పుడు సభ్యులు ఎవరైనా అభ్యంతరం వ్యక్తం చేయవచ్చు. ఏ ప్రాతిపదికన అభ్యంతరం చెబుతున్నారో లిఖితపూర్వకంగా సమర్పించాల్సి ఉంటుంది. దానిపై ఉభయ సభల సభ్యులు సంతకం చేసినప్పుడే ప్రిసైడింగ్ అధికారి వీటిని పరిగణనలోకి తీసుకుంటారు.

ఇలాంటి అభ్యంతరాలు వ్యక్తమైనప్పుడు సంయుక్త సమావేశం రద్దవుతుంది. సభలు వేర్వేరుగా సమావేశమై.. అభ్యంతరాలపై రెండు గంటలు చర్చిస్తాయి. సభ్యులు లేవనెత్తిన అభ్యంతరాలపై విచారణ జరపాలంటే సాధారణ మెజారిటీతో రెండు సభలు ఆమోదించాల్సి ఉంటుంది.

తర్వాత సంయుక్త సమావేశంలో మళ్లీ అభ్యంతరాలు(వేరే రాష్ట్రంలో ఎన్నికలపై) తలెత్తితే ఇదే ప్రక్రియ పునరావృతం అవుతుంది.

ఈసారి అభ్యంతరాలు ఉంటాయా?

ఈసారి కనీసం మూడు సార్లు ఈ ప్రక్రియ జరిగే అవకాశం ఉంది. 13 మంది సెనేటర్లు, 100 మందికి పైగా ప్రతినిధుల సభ సభ్యులు ట్రంప్​కు మద్దతుగా వ్యవహరిస్తున్నారు. వీరు ఫలితాలపై అభ్యంతరాలు తెలపనున్నట్లు సమాచారం. ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని ట్రంప్ ఆరోపిస్తున్న ఆరు స్వింగ్ స్టేట్స్​ల ఓట్లను వీరు సవాల్ చేయనున్నారు. అరిజోనా, జార్జియా, మిషిగన్, నెవాడా, పెన్సిల్వేనియా, విస్కాన్సిన్ ఓట్లపై అభ్యంతరం తెలిపే అవకాశం ఉంది. ఇదే జరిగితే బుధవారం రాత్రి లేదా గురువారం కూడా సమావేశం కొనసాగుతుంది.

ఓట్లను కాంగ్రెస్ లెక్కించిన తర్వాత ఏం జరుగుతుంది?

ఎన్నికల ఫలితాలపై అభ్యంతరాలు తెలిపేందుకు సంయుక్త సమావేశమే చివరి అవకాశం. కాంగ్రెస్ ఓట్లను లెక్కించడం పూర్తయితే.. అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులకు పేర్లు ఖరారవుతాయి.

అధికారం లేదన్న పెన్స్!

అయితే ఫలితాలను సవాల్ చేసే అధికారం తనకు లేదని ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ ట్రంప్​కు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. అధ్యక్షుడితో జరిగిన విందులో ఈ విషయాన్ని తెలియజేశారని న్యూయార్క్ టైమ్స్ తెలిపింది. సంబంధిత వర్గాలు ఈ వివరాలను వెల్లడించినట్లు స్పష్టం చేసింది.

కానీ, ట్రంప్ మాత్రం న్యూయార్క్ టైమ్స్ కథనాన్ని తోసిపుచ్చారు. పెన్స్ అలాంటి విషయం తనకు చెప్పనేలేదని అన్నారు. ఉపాధ్యక్షుడికి ఆ ఆధికారం ఉందని ఇద్దరం పూర్తి ఏకాభిప్రాయంతో ఉన్నామని స్పష్టం చేశారు.

ఇదీ చదవండి: వ్యవస్థలపై ట్రంప్ తీరు ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం

అధ్యక్ష పదవిని నిలబెట్టుకునేందుకు ట్రంప్ చేస్తున్న ప్రయత్నాల్లో ఇదే చివరిది కానుంది. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున నిరసనకారులు వాషింగ్టన్​కు చేరుకున్నారు. అధ్యక్షుడు ట్రంప్​కు మద్దతుగా ర్యాలీలు చేస్తున్నారు.

ఓడినా.. ట్రంప్ నామస్మరణే!

మరోవైపు, ట్రంప్​కు ఏమాత్రం ఆదరణ తగ్గలేదని మరోసారి రుజువైంది. ఎన్నికల్లో ట్రంప్ ఓడిపోయినప్పటికీ... బైడెన్ గెలుపు మాత్రం చట్టబద్ధం కాదని తన మద్దతుదారులను నమ్మించడంలో విజయవంతమైనట్లే కనిపిస్తోంది. అసోసియేటెడ్ ప్రెస్(ఏపీ) ఓట్​కాస్ట్ సర్వేలో ఈ విషయం వెల్లడైంది.

జార్జియా సెనేట్​ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్న వేళ ఆ రాష్ట్రంలోని రిపబ్లికన్ మద్దతుదారులతో సర్వే నిర్వహించింది అసోసియేటెడ్ ప్రెస్. 3,600 మంది రిజిస్టర్డ్ ఓటర్లను ఇంటర్వ్యూ చేసింది. వివిధ అంశాలపై ప్రశ్నలను సంధించింది. నవంబర్ 3న జరిగిన ఎన్నికల్లో ఓట్లను సరిగా లెక్కించలేదని 10లో 9 మంది రిపబ్లికన్లు భావిస్తున్నారని సర్వేలో తేలింది. సగం మంది ఓట్ల కౌంటింగ్​పై తమకు విశ్వాసం లేదని తెలిసింది. ఎన్నికల మోసాలపై ట్రంప్ పదేపదే ప్రసంగాలు చేయడం ఇందుకు కారణమని స్పష్టమవుతోంది.

ఇదీ చదవండి: గెలుపైనా.. ఓటమైనా... నిను వీడని నీడ మేమే!

నవంబర్​లో జరిగిన ఇదే తరహా సర్వేతో పోలిస్తే అధికంగా ఫలితాలను వ్యతిరేకించే వారి సంఖ్య ఐదు రెట్లు పెరిగింది. అదే సమయంలో ట్రంప్ ర్యాలీలకు భారీగా జనం హాజరవుతున్నారు. ఇప్పటికీ పార్టీపై ట్రంప్ గట్టి పట్టు కొనసాగిస్తున్నారు. వీటిని పరిశీలిస్తే ట్రంప్ ప్రజాదరణ ఏమాత్రం తగ్గలేదని స్పష్టమవుతోంది. ట్రంపిజానికి మాత్రం ఏ ఢోకా లేదని తెలుస్తోంది.

ఇదీ చదవండి: ట్రంప్​ ఫ్యాన్స్​ దెబ్బకు మోత మోగిపోయింది!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.