తాను అధ్యక్షునిగా ఎన్నికైతే అమెరికావాసులు అందరికీ ఉచితంగా కరోనా వ్యాక్సిన్ అందజేస్తానని డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్ హామీ ఇచ్చారు. శుక్రవారం సొంతరాష్ట్రం డెలవేర్లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆయన ప్రసంగించారు.
"వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే ఆరోగ్య బీమా ఉందా లేదా అన్న దానితో సంబంధం లేకుండా అందరికీ ఉచితంగా ఇస్తాం. అవసరమైన వ్యాక్సిన్ మొత్తాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేసి పంపిణీ చేస్తుంది."
-- జో బైడెన్, డెమొక్రటిక్ అధ్యక్ష అభ్యర్థి
అధ్యక్షుడు ట్రంప్ వద్ద ఎలాంటి ప్రణాళిక లేకపోవడం వల్లే దేశంలో కరోనా విజృంభించిందని ఆరోపించారు.
వీక్షకుల సంఖ్యలో తగ్గుదల
ట్రంప్-బైడెన్ చివరి సంవాదాన్ని 6.3 కోట్ల మంది టీవీల్లో వీక్షించారు. మొదటి సంవాదంతో పోల్చితే వీక్షకుల సంఖ్య ఒక కోటి తగ్గింది.
ఇదీ చూడండి:అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓటువేసిన ట్రంప్