ETV Bharat / international

భారత్​-అమెరికా విదేశాంగ మంత్రుల సంభాషణ

అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకన్​..భారత విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర్​తో ఫోన్​లో మంగళవారం సంభాషించారు. మయన్మార్​లో మిలిటరీ ప్రభుత్వం​, ప్రజాస్వామ్యం ప్రాముఖ్యతపై చర్చించారు. భారత్​ - అమెరికా ద్వైపాక్షిక సంబంధాలపై మాట్లాడారు.

Jaishankar and Blinken talk over phone, discuss Myanmar situation and issues of mutual concern
భారత్​-అమెరికా విదేశాంగ మంత్రుల ఫోన్​కాల్
author img

By

Published : Feb 10, 2021, 5:26 AM IST

భారత విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర్​తో అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకన్ ఫోన్​లో సంభాషించారు. మయన్మార్​లో సైనిక పాలన, ప్రజాస్వామ్యం తదితర అంశాలపై చర్చించారు. అమెరికా-భారత్ ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు జరిపినట్లు అమెరికా విదేశాంగ ప్రతినిధి నెడ్​ ప్రైస్ తెలిపారు.

"ఇరు దేశాల విదేశాంగ మంత్రులు ఇండో పసిఫిక్​ ప్రాంతంలో శాంతి, సుస్థిరతలను పరిరక్షించే దిశగా వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని అభిప్రాయపడ్డారు. క్వాడ్ దేశాలు, కొవిడ్​-19, పర్యావరణ మార్పు తదితర అంశాలపై చర్చించారు."

--- నెడ్​ ప్రైస్, అమెరికా విదేశాంగ ప్రతినిధి

అమెరికా విదేశాంగ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన బ్లింకన్.. జైశంకర్​తో ఫోన్​కాల్​లో సంభాషించటం ఇది రెండోసారి. కాగా.. జో బైడెన్ అమెరికా అధ్యక్షుడైనప్పటి నుంచి ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత బలపడ్డాయి. ఫిబ్రవరి 8న బైడెన్, ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్​ ద్వారా సంభాషణ జరిపారు.

భారత్-చైనా సరిహద్దు ఉద్రిక్తతలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నామని అమెరికా విదేశాంగ ప్రతినిధి నెడ్​ ప్రైస్ తెలిపారు. ఇరు దేశాల మధ్య చర్చలు జరిపి, శాంతియుతంగా సమస్యను పరిష్కరించుకోవాలన్నారు. చైనా.. సరిహద్దు దేశాలతో వ్యవహరిస్తున్న తీరును నిశితంగా పరిశీలిస్తున్నామని తెలిపారు. తాము ఎల్లప్పుడూ స్నేహితులు, భాగస్వాముల పక్షాన ఉంటామని స్పష్టం చేశారు.

ఇదీ చదవండి : సెనేట్​ ముందుకు ట్రంప్​ అభిశంసన

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.