ETV Bharat / international

కొవిడ్​ను దరిచేరనివ్వని ఇవర్​మెక్టిన్​! - ఇవర్​మెక్టిన్​ పై పరిశోధనలు

కరోనా మహమ్మారికి ముగింపు పలకడానికి ఇవర్​మెక్టిన్​ అనే ఔషధం దోహదపడుతుందని అంటున్నారు శాస్త్రవేత్తలు. ఇది క్రమం తప్పకుండా తీసుకుంటే కొవిడ్​ను కొంతమేర దరిచేరకుండా చూసుకోవచ్చని తెలిపారు.

ivermectin
కొవిడ్​ను దరిచేరనివ్వని ఇవర్​మెక్టిన్​!
author img

By

Published : May 11, 2021, 10:51 AM IST

ఇవర్​మెక్టిన్​ అనే ఔషధాన్ని క్రమం తప్పకుండా తీసుకుంటే.. కొవిడ్​ను చాలా వరకూ దరిచేరకుండా చూసుకోవచ్చని శాస్త్రవేత్తలు తెలిపారు. కరోనా మహమ్మారికి ముగింపు పలకడానికి ఇది దోహదపడుతుందని చెప్పారు. ఇవర్​మెక్టిన్​ అనేది నోటిద్వారా తీసుకునే ఔషధం. వివిధ పరాన్న జీవులతో సంక్రమించే ఇన్​ఫెక్షన్లను నయం చేయడానికి దీన్ని వైద్యులు సూచిస్తుంటారు. తాజాగా.. వైద్యనిపుణులు, శాస్రవేత్తలతో కూడిన ఫ్రంట్​లైన్​ కొవిడ్​-19 క్రిటికిల్​ కేర్​ అలయెన్స్​, ఎఫ్​ఎల్​సీసీసీ సంస్థ ఈ ఔషధంపై పరిశోధన చేసింది. ఆ వివరాలు అమెరికన్​ జర్నల్​ ఆఫ్​ థెరాప్టిక్స్​లో ప్రచురితంమయ్యాయి. ఇవర్​మెక్టిన్​పై జరగిన క్లినికల్​, ల్యాబ్​, జంతు పరిశోధనల్లో వెలువడిన డేటాను శాస్త్రవేత్తలు విశ్లేషించారు.

'ఈ ఔషధానికి సంబంధించి ఇది సమగ్ర సమీక్ష. నిర్ధిష్ట ప్రమాణాలతో డేటాను విశ్లేషించాం.'అని ఎఫ్​ఎల్​సీసీసీ అధ్యక్షుడు పీయర్​ కోరీ చెప్పారు. కొవిడ్​ను నిర్వహించడంలో ఇవర్​మెక్టిన్​ పాత్రను తేల్చడానికి 2500 మంది పరీక్షార్థులపై నిర్వహించిన 8 పరిశోధనలపై వీరు దృష్టిసారించారు. క్రమం తప్పకుండా ఈ ఔషధాన్ని తీసుకుంటే.. కరోనా సోకే ప్రమాదం గణనీయంగా తగ్గుతుందని తేల్చారు. కొవిడ్​ బాధితులపైనా ఇది అద్భుతంగా పని చేస్తుందని 42 ప్రయోగాల డేటాను విశ్లేషించినప్పుడు వెల్లడైందన్నారు. ఈ ఔషధం.. బాధితుల్లో మరణం ముప్పును తగ్గిస్తోందని, శరీరం నుంచి వైరస్​ను వేగంగా నిర్మూలిస్తుందని తెలిపారు.

ఇదీ చూడండి: 'గత 40 ఏళ్లలో లేని విధంగా అమెరికా ఆర్థిక వ్యవస్థ వృద్ధి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.