ETV Bharat / international

'కశ్మీర్​ సహా భారతదేశమంతటా ఇస్లామిక్​​ ఉగ్రవ్యాప్తి' - terror outfit busted

ఇస్లామిక్ వేర్పాటువాదులు జమ్ముకశ్మీర్ సహా భారతదేశమంతటా ఉగ్రవాదాన్ని వ్యాప్తి చేస్తున్నారని అమెరికా చట్టసభ సభ్యుడు ఫ్రాన్సిస్ రూనీ వ్యాఖ్యానించారు. ఈ అంశమై భారత్​కు మద్దతివ్వాలని ప్రతినిధుల సభ వేదికగా ఉద్ఘాటించారు. రిపబ్లికన్ పార్టీ తరఫున ఫ్లోరిడా రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు రూనీ.

'కశ్మీర్​ సహా భారత్​ వ్యాప్తంగా ఇస్లామిక్​​ ఉగ్రవ్యాప్తి'
author img

By

Published : Nov 22, 2019, 10:22 AM IST

ఇస్లామిక్ వేర్పాటువాదులు జమ్ముకశ్మీర్​లో నిత్యం కొనసాగుతున్న ప్రమాదమని అమెరికా చట్టసభ సభ్యుడు ఫ్రాన్సిస్​ రూనీ వ్యాఖ్యానించారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్​ చేస్తున్న పోరాటానికి మద్దతివ్వాలని యూఎస్​ కాంగ్రెస్​ సభ్యులకు విజ్ఞప్తి చేశారు.

ఫ్లోరిడా రాష్ట్రం నుంచి అమెరికా ప్రతినిధుల సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న రూనీ.. చట్టసభలో భారత్​తో సంబంధాలపై ప్రసంగించారు. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో దూకుడుగా ముందుకెళ్తున్న చైనాను భారత్​ ఎదుర్కొంటోందని.. ఈ నేపథ్యంలో భారత్​కు అమెరికా సహకారం అవసరమని వ్యాఖ్యానించారు. వాణిజ్య రంగంలో శ్వేతసౌధానికి భారత్ కీలక భాగస్వామిగా అభివర్ణించారు.

"ప్రాంతీయ, భౌగోళిక రాజకీయాలను భారత్ ఎదుర్కొంటోంది. ఇస్లామిక్ వేర్పాటువాదం కశ్మీర్​లో నిత్యం కొనసాగుతున్న ప్రమాదం. జమ్ముకశ్మీర్​ సహా భారత్ అంతటా ఉగ్రవాదాన్ని వ్యాప్తి చేస్తున్నారు. ఉగ్రవాద వ్యతిరేక పోరాటంలో భారత్​కు సహకరించాలి."

-ఫ్రాన్సిస్ రూనీ, అమెరికా కాంగ్రెస్ సభ్యుడు

భారత్​కు అనుకూలంగా మాట్లాడిన అమెరికా చట్టసభ సభ్యుల్లో ఫ్రాన్సిస్ రూనీ మూడోవారు. ఇంతకుముందు జార్జి హోల్డింగ్, పీట్ ఓల్సన్ భారత్​కు అనుకూల వ్యాఖ్యలు చేశారు. అమెరికాలో భారత రాయబారి హర్షవర్ధన్ శ్రింఘ్లాతోనూ ఇటీవల సమావేశమయ్యారు రూనీ. భారత్​తో అమెరికా ద్వైపాక్షిక సంబంధాల ప్రాముఖ్యతపై చర్చించారు.

ఇదీ చూడండి: నౌకాదళంలో తొలి మహిళా పైలట్​ శివాంగి

Raipur (Chhattisgarh), Nov 22 (ANI): Chhattisgarh Agriculture Minister Ravindra Choubey on Thursday said that before every session of the state, the state song (Arpa pairy ke dhar) will also be sung after national song Vande Mataram. He said, "A decision was taken during the cabinet meeting today, before every session of the state Assembly, state song (Arpa pairy ke dhar) will also be sung after national song Vande Mataram."
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.