ETV Bharat / international

లాడెన్​పై యూఎస్​కు ఐఎస్​ఐ సమాచారం: ఇమ్రాన్

అమెరికాలో ప్రధాని హోదాలో తొలిసారి పర్యటిస్తున్న పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఐఎస్​ఐ ఇచ్చిన సమాచారం ఆధారంగానే అల్​ఖైదా అధినేత ఒసామా బిన్ లాడెన్​ను అమెరికా మట్టుబెట్టగలిగిందని వ్యాఖ్యానించారు. లాడెన్ పాక్​లో ఉన్న సంగతి తమకు తెలియదని ఇప్పటివరకు పాక్ బుకాయిస్తూ వచ్చింది.

author img

By

Published : Jul 23, 2019, 5:20 PM IST

Updated : Jul 23, 2019, 5:29 PM IST

లాడెన్​పై యూఎస్​కు ఐఎస్​ఐ సమాచారం: ఇమ్రాన్

సీఐఏ(అమెరికా నిఘా విభాగం)కు ఐఎస్​ఐ ఇచ్చిన సమాచారం ఆధారంగానే... కరడుగట్టిన ఉగ్రవాది, అల్​ఖైదా అధినేత ఒసామా బిన్​ లాడెన్​ను అమెరికా మట్టుబెట్టగలిగిందని పాకిస్థాన్​ ప్రధాని ఇమ్రాన్​ఖాన్​ తాజాగా వ్యాఖ్యానించారు. అమెరికా పర్యటనలో ఉన్న ఇమ్రాన్​ఖాన్... డొనాల్డ్​ట్రంప్​నకు అత్యంత ఇష్టమైన​ ఓ ప్రముఖ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్​వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించారు.

2011 మే 2న పాకిస్థాన్​ అబోటాబాద్​లో తలదాచుకున్న ఒసామా బిన్​ లాడెన్​ను అమెరికాకు చెందిన నేవీ సీల్స్​ కాల్చి చంపారు. అప్పటి వరకు అల్​ఖైదా అధినేత గురించి తనకేమీ తెలియదని ప్రపంచానికి చెబుతూ వచ్చింది పాకిస్థాన్. ఇప్పుడు సీఐఏకు తామే సమాచారం ఇచ్చామని పాక్​ మాటమార్చింది.

అఫ్రీది విడుదల?

ఒసామా ఆచూకీపై సీఐఏకు పాకిస్థాన్​ వైద్యుడు షకీల్ అఫ్రీది సమాచారం ఇచ్చారనే సాకుతో ఆయనను కారాగారంలో వేసింది పాకిస్థాన్​ ప్రభుత్వం.

అమెరికా... పాకిస్థాన్​కు మిత్రదేశమని, అందుకే ఒసామా ఆచూకీ గురించి సీఐఏకి... ఐఎస్​ఐ ఫోన్​ ద్వారా సమాచారం ఇచ్చిందని ఇమ్రాన్​ఖాన్​ తాజాగా వెల్లడించారు. ఈ నేపథ్యంలో షకీల్​ అఫ్రీదిని విడుదల చేస్తారా అన్న మీడియా ప్రశ్నకు ఇమ్రాన్​ సమాధానం దాటవేశారు. అఫ్రీదిని అమెరికా గూఢచారిగా భావిస్తున్నందున... ఆయన విడుదల అన్నది పాక్​ ప్రజలకు భావోద్వేగంతో ముడిపడిన విషయమని ఇమ్రాన్ అన్నారు. ట్రంప్​ మాత్రం అఫ్రీదిని విడుదల చేయాలని పాకిస్థాన్​ను కోరుతున్నారు.

లాడెన్ కారణంగా 3వేల మంది అమెరికన్లు చనిపోయారన్న ప్రశ్నకు పాకిస్థాన్ 70 వేలమంది పౌరులను కోల్పోయిందని సమాధానమిచ్చారు ఇమ్రాన్. ప్రధానిగా కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉందని విలేకరి గుర్తు చేయగా... ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలదీ ప్రధాన పాత్ర అయిన కారణంగా ప్రధాని సైతం కొన్ని నిర్ణయాలు తీసుకోలేరని వ్యాఖ్యానించారు. కొన్ని సంప్రదింపుల అనంతరమే ఏదైనా సాధ్యమౌతుందన్నారు.

ఇదీ చూడండి: కర్​నాటకం: కాంగ్రెస్​-భాజపాల మధ్య మాటల యుద్ధం

Intro:Body:

x

Conclusion:
Last Updated : Jul 23, 2019, 5:29 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.