ETV Bharat / international

కరోనా వేళ.. స్విమ్మింగ్​ పూల్స్​ భద్రమేనా?

నీటి ద్వారా కరోనా వ్యాపిస్తుందని అనడానికి ఎలాంటి ఆధారాలు లేవని అమెరికాకు చెందిన వ్యాధి నియంత్రణ, నివారణ కేంద్రం(సీడీసీ) స్పష్టం చేసింది. ఫలితంగా భౌతిక దూరం నియమాలను పాటిస్తూ.. పూల్స్​, బీచ్​లలో స్విమ్మింగ్​ చేయవచ్చని వెల్లడించింది.

author img

By

Published : Jun 11, 2020, 1:19 PM IST

Is it safe to go swimming during the coronavirus pandemic?
కరోనా వైళ.. స్విమ్మింగ్​ పూల్స్​ భద్రమేనా?

కరోనా వైరస్​ మహమ్మారి వల్ల ప్రతి చిన్న విషయానికీ భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. ఇంటి నుంచి బయటకు వెళ్లినా, ఎవరైనా తుమ్మినా మనలో ఏదో ఆందోళన పుట్టుకొస్తోంది. 'మరి ఈ పరిస్థితుల్లో స్విమ్మింగ్​ చేయవచ్చా?' అంటే ఎలాంటి భయాలు లేకుండా బీచ్​లు, పూల్స్​లో స్విమ్మింగ్​ చేసేయొచ్చంటోంది అమెరికాలోని సీడీసీ(వ్యాధి నియంత్రణ, నివారణ కేంద్రం​). అయితే స్విమ్మింగ్​ చేసేటప్పుడు కూడా కచ్చితంగా భౌతిక దూరాన్ని పాటించాలని తేల్చిచెబుతోంది.

నీటిలో కరోనా వైరస్​ వ్యాపిస్తుందని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు లేవని స్పష్టం చేసింది సీడీసీ. పూల్స్​ను కడిగేందుకు ఉపయోగించే క్లోరిన్​తో వైరస్​ నుంచి మరింత రక్షణ లభిస్తుందని పేర్కొంది.

పూల్స్​ నిర్వహించే వారికి స్పష్టమైన హెచ్చరికలు జారీ చేసింది అమెరికా ఆరోగ్య విభాగం. తక్కువ మందికే అనుమతించేలా చర్యలు చేపట్టాలని తెలిపింది. కనీసం 6 అడుగుల భౌతిక దూరం పాటించాలని పేర్కొంది. ముఖానికి కవర్​ తొడుక్కోవాలని, తరచూ చేతులు శుభ్రంగా కడుక్కోవాలని వెల్లడించింది. ఆరోగ్యం బాగాలేకపోతే ఇంట్లోనే ఉండాలని సూచించింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.