ఇరాన్‌పై అమెరికా, సౌదీ అరేబియాలు సైనిక చర్యకు పూనుకుంటే అది తీవ్ర యుద్ధానికి దారితీస్తుందని ఆ దేశ విదేశాంగమంత్రి మొహమ్మద్ జావెద్ జారిఫ్ హెచ్చరించారు.
"మేము యుద్ధాన్ని కోరుకోవడంలేదు. యుద్ధమే వస్తే అది భారీ ప్రాణ నష్టానికి దారితీస్తుంది. కానీ మా దేశాన్ని రక్షించుకునే విషయంలో వెనకడుగు వేసేది లేదు."-మొహమ్మద్ జావెద్, ఇరాన్ విదేశాంగమంత్రి
దాడులు చేసింది ఎవరు?
ఆరాంకో చమురు క్షేత్రాలపై దాడికి పాల్పడింది తామేనని యెమెన్‌కు చెందిన హుతీ తిరుగుబాటుదారులు ప్రకటించుకున్నారు. అయితే డ్రోన్ దాడులకు పాల్పడింది ఇరానేనని అమెరికా ఆరోపిస్తోంది. ఇరాన్ తన భూభాగం నుంచే క్రూయిజ్ మిసైల్స్‌ను ప్రయోగించిందని శ్వేతసౌధం అంటోంది. అయితే అమెరికా, సౌదీ ఆరోపణలను ఇరాన్ ఖండించింది. తాము దాడులు చేయలేదని ప్రకటించింది.
శాంతియుత పరిష్కారం
గల్ఫ్ తీరంలో ఉద్రిక్తతలు రూపుమాపడానికి ఇరాన్‌తో శాంతి చర్చలు జరిపేందుకు ఆమెరికా సిద్ధంగా ఉందని ఆ దేశ విదేశాంగమంత్రి మైక్ పాంపియో తెలిపారు. తమపై సైనిక చర్యలు తీసుకుంటే.. అది తీవ్రయుద్ధానికి దారితీస్తుందన్న ఇరాన్ హెచ్చరికల నేపథ్యంలో పాంపియో ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఇదీ చూడండి: కేంద్రమంత్రిని అడ్డుకున్న వామపక్ష విద్యార్థి సంఘాలు