ETV Bharat / international

అమెరికా అధ్యక్షుడు ట్రంప్​పై అరెస్ట్​ వారెంట్​ జారీ - ఇరాన్​ అరెస్ట్​ వారెంట్​

తమ​ టాప్​ కమాండర్​ సులేమానీ హత్య ఘటనకు సంబంధించి అమెరికా అధ్యక్షుడు ట్రంప్​ సహా మరో 30మందిపై అరెస్ట్​ వారెంట్​ జారీ చేసింది ఇరాన్​. ట్రంప్​ను అదుపులోకి తీసుకునేందుకు సహకరించాలని ఇంటర్​పోల్​ను ఆశ్రయించింది.

Iran issues arrest warrant for Trump, asks Interpol to help
అమెరికా అధ్యక్షుడు ట్రంప్​పై అరెస్ట్​ వారెంట్​
author img

By

Published : Jun 29, 2020, 5:40 PM IST

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​పై అరెస్ట్​ వారెంట్​ జారీ చేసింది ఇరాన్​. తమ దేశానికి చెందిన కీలక సైనికాధిపతి ఖాసీం సులేమానీని వైమానిక దాడిలో అమెరికా హతమార్చిందంటూ ట్రంప్​ సహా మరో 30మందిపై ఈ చర్యలు చేపట్టింది. అధ్యక్షుడిని అదుపులోకి తీసుకునేందుకు సహాయం చేయాలని ఇంటర్​పోల్​ను కూడా ఆశ్రయించింది.

ఈ అరెస్ట్​ వారెంట్​తో ట్రంప్​కు ఎలాంటి ముప్పు లేనప్పటికీ... అమెరికా-ఇరాన్​ మధ్య ఉద్రిక్తతలు మళ్లీ పెరిగే అవకాశముందని నిపుణులు భావిస్తున్నారు.

అగ్రరాజ్య అధ్యక్షుడిపై హత్య, ఉగ్రవాద ఛార్జీలు మోపినట్టు ఇరాన్​​ ప్రాసిక్యూటర్​ అలి అల్​ఖసిమెహ్ర తెలిపారు. అధ్యక్షుడిగా తన పదవీ కాలం ముగిసిన తర్వాత కూడా ట్రంప్​పై విచారణ కొనసాగుతుందని పేర్కొన్నారు.

ఈ పూర్తి వ్యవహారంపై ఇంటర్​పోల్​ ఇంకా అధికారికంగా స్పందించలేదు. ఈ సమాచారాన్ని సభ్య దేశాలతో పంచుకోవాలా? వద్దా? అనే విషయంపై చర్చలు జరిపి ఓ నిర్ణయం తీసుకుంటుంది ఇంటర్​పోల్​. అయితే రాజకీయాలకు సంబంధించిన కార్యకలాపాల్లో ఇంటర్​పోల్​ జోక్యం చేసుకోదు. అందుకే ఈ వ్యవహారంపై ఇంటర్​పోల్​ ఎలాంటి సంచలనాత్మక చర్యలు చేపట్టే అవకాశాలు లేవు.

ఈ ఏడాది జనవరిలో.. ఇరాక్​ రాజధాని బాగ్దాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలో రాకెట్​ దాడి జరిపింది అమెరికా. ఈ దాడిలో ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ కమాండర్ ఖాసీం సులేమానీని మట్టుబెట్టినట్టు ప్రకటించింది. ఈ విషయాన్ని ధ్రువీకరించిన ఇరాన్​.. ప్రతీకార చర్యలకు సిద్ధంగా ఉండాలని అమెరికాను హెచ్చరించింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.