హోర్ముజ్ జలసంధి వద్ద చమురు నౌకలపై దాడి, ఇరాక్‌తో కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్విట్టర్ వేదికగా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అమెరికా ఆసక్తులు లక్ష్యంగా ఏ విధమైన దాడి చేసినా ఊరుకోబోమని, దీటుగా ప్రతిస్పందిస్తామని హెచ్చరించారు. కొన్ని సార్లు దీటైన ప్రతిస్పందనంటే నామరూపాలు లేకుండా చేయడమూ అవుతుందని పేర్కొన్నారు.
ప్రపంచంలోనే శక్తిమంతమైన సైన్యాన్ని అమెరికా కలిగి ఉందని ఇరాన్ నేతలు గుర్తించాలన్నారు ట్రంప్.