ETV Bharat / international

'కరోనాతో విమాన రంగం కుదేలు.. అయినా రికవరీకి ఛాన్స్' - ఐఏటీఏ విధులు

కరోనా కారణంగా విమానయాన రంగం తీవ్రంగా ప్రభావితమైందని అంతర్జాతీయ ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్ వెల్లడించింది. అయితే తీవ్రమైన సమస్యలు ఉన్నప్పటికీ.. రికవరీకి మార్గం ఉందని ఐఏటీఏ డైరెక్టర్ జనరల్ విల్లీ వాల్ష్ అన్నారు.

IATA
ఐఏటీఏ
author img

By

Published : Oct 5, 2021, 11:24 AM IST

కరోనా కారణంగా విమాన రంగం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్ (ఐఏటీఏ) వెల్లడించింది. కొవిడ్-19 విజృంభణతో 2020-22 మధ్య ప్రపంచ విమానయాన రంగానికి 201 బిలియన్ డాలర్ల నష్టం(సుమారు 14లక్షల కోట్ల రూపాయలు) వాటిల్లిందని పేర్కొంది. 2019తో పోలిస్తే విమానయాన సేవలు 22శాతం మాత్రమే నడుస్తున్నాయని తెలిపింది. ఈ మేరకు అంతర్జాతీయ ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్ 77వ వార్షిక సర్వసభ్య సమావేశంలో పలు అంశాలను వెల్లడించింది. 'విమాన పరిశ్రమలో సమస్యలు ఉన్నప్పటికీ రికవరీకి మార్గం ఉందనిపిస్తోంది' అని ఐఏటీఏ డైరెక్టర్ జనరల్ విల్లీ వాల్ష్ విశ్లేషించారు.

"ఆర్థిక వ్యవస్థలు క్రమంగా పుంజుకుంటున్నాయి. అయితే కరోనా ఉద్ధృతి తగ్గుతున్నప్పటికీ వివిధ దేశాలు తమ గగనతలాలను ఉపయోగించకుండా ఆంక్షలు విధించడం సరికాదనిపిస్తోంది."

-విల్లీ వాల్ష్, ఐఏటీఏ డైరెక్టర్ జనరల్

వివిధ దేశాల్లో ఆంక్షలు సడలించిన నేపథ్యంలో టీకా సర్టిఫికేట్​లు త్వరితగతిన జారీచేయాల్సిన అవసరముందని విల్లీవాల్ష్ అభిప్రాయపడ్డారు. టీకా రెండు డోసులు తీసుకున్నప్పటికీ భారతీయ ప్రయాణికులను తమ దేశం​లోకి అనుమతించకుండా బ్రిటన్ కొర్రీలు పెడుతున్న నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

కరోనా కారణంగా అంతర్జాతీయ ప్యాసింజర్ విమానాలను 2020 మార్చి 23న నిలిపేసింది భారత్. అయితే.. ఎంపిక చేసిన 28 దేశాలకు "ఎయిర్ బబుల్" సౌకర్యం ద్వారా విమానాలను నడుపుతోంది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.