ETV Bharat / international

ఈనెల చివర్లో భారత్​కు ట్రంప్​.. వాణిజ్య ఒప్పందంపై సంతకం! - trump on india

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ ఈ నెల చివరి వారంలో భారత పర్యటనకు రానున్నారు. ఈ పర్యటనలోనే వాణిజ్య ఒప్పందం సహా రక్షణ రంగంలో సహకారంపై కీలక ఒప్పందాలు కుదిరే అవకాశాలు ఉన్నాయని అధికార వర్గాలు పేర్కొన్నాయి. వాణిజ్య ఒప్పందానికి ఇరు దేశాల అధికారులు తుది మెరుగులు దిద్దుతున్నట్లు తెలిపాయి.

President Trump's India visit
ఈనెల చివర్లో భారత్​కు ట్రంప్​.
author img

By

Published : Feb 5, 2020, 5:43 AM IST

Updated : Feb 29, 2020, 5:42 AM IST

ఈనెల చివరి వారంలో భారత పర్యటనకు ట్రంప్​

అగ్రరాజ్యం అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన మూడేళ్ల తర్వాత తొలిసారి భారత్​లో పర్యటించనున్నారు డొనాల్డ్​ ట్రంప్​. ఈ నెల చివరి వారంలో భారత్​ రానున్నారు​. ఈ పర్యటనతో భారత్​-అమెరికా మధ్య తలెత్తిన వాణిజ్య విభేదాలు తొలగిపోయే అవకాశాలు ఉన్నట్లు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.
ట్రంప్​ పర్యటనలోనే వాణిజ్య ఒప్పందం కుదుర్చుకునేందుకు ప్రణాళికలు జరుగుతున్నట్లు తెలిపాయి. కొన్ని నిర్దిష్ట రంగాలను కలుపుకొని చేసే ప్రతిపాదిత వాణిజ్య ఒప్పందానికి భారత్​, అమెరికా అధికారులు తుది మెరుగులు దిద్దుతున్నట్లు సమాచారం.

"అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ పర్యటనలోనే వాణిజ్య ఒప్పందం సహా రక్షణ రంగంలో సహకారంపై ఒప్పందం కుదిరే అవకాశం ఉంది."

- అధికార వర్గాలు.

ఈనెల 23-26 మధ్య..

ఈనెల 23 నుంచి 26 మధ్య రెండు రోజుల పాటు భారత్​లో పర్యటించనున్నారు అధ్యక్షుడు ట్రంప్​. ఈ పర్యటన షెడ్యూల్​ను ఖరారు చేసే పనిలో నిమగ్నమయ్యారు ఇరు దేశాల అధికారులు. ట్రంప్​ పర్యటన ప్రధానంగా దేశ రాజధాని దిల్లీలోనే ఉంటుంది. అయితే.. మరో నగరాన్ని సందర్శించే అంశాన్ని పరిశీలిస్తున్నారు అధికారులు. అందులో ప్రధానంగా ఆగ్రా, అహ్మదాబాద్​లు ఉన్నాయి.

ట్రంప్​ విదేశీ పర్యటనలను పరిశీలించే ఉన్నత స్థాయి అధికారుల బృందం ఇప్పటికే భారత్​లో పర్యటించింది.

సుంకాల తగ్గింపుపై..

ఈ వాణిజ్య ఒప్పందం ద్వారా స్టీల్​, అల్యూమినియంపై అమెరికా విధిస్తోన్న అధిక సుంకాల నుంచి మినహాయింపులు ఇవ్వాలని డిమాండ్​ చేస్తోంది భారత్​. జీఎస్​పీ హోదా కింద పలు ఉత్పత్తుల సుంకాల ప్రయోజనాలను తిరిగి ప్రారంభించాలని కోరుతోంది. వ్యవసాయ, ఆటోమొబైల్​, ఆటో కాంపొనెంట్స్​, ఇంజినీరింగ్​ ఉత్పత్తులపై మార్కెట్​ వసతులు కల్పించాలని అమెరికాపై ఒత్తిడి తెస్తోంది భారత్​.

మరోవైపు.. తమ వ్యవసాయ, తయారీ, పాడి, ఔషధ​ ఉత్పత్తులకు భారత్​లో మార్కెట్​ అవకాశాలు కల్పించాలని అమెరికా కోరుతోంది.

ఎగుమతులు-దిగుమతులు ఇలా..

2018-19లో అమెరికాకు భారత ఎగుమతులు 52.4 బిలియన్​ డాలర్లు కాగా... అదే సమయంలో దిగుమతులు 35.5 బిలియన్​ డాలర్లుగా ఉన్నాయి. వాణిజ్య లోటు​ 2017-18 (21.3 బిలియన్​ డాలర్లు)తో పోలిస్తే 2018-19లో 16.9 బిలియన్​ డాలర్లకు తగ్గింది. ఇదే సమయంలో భారత్​కు విదేశీ పెట్టుబడుల రూపంలో 3.13 బిలియన్​ డాలర్లు ఉచ్చాయి.

ఈఏడాది 71వ గణతంత్ర దినోత్సవానికి ముఖ్య అతిథిగా రావాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్​ను భారత్​ ఆహ్వానించింది. కానీ.. పలు కారణాలతో రాలేనని చెప్పారు.

ఇదీ చూడండి: కాకస్​లో బోణీ కొట్టిన ట్రంప్​- డెమొక్రాట్లలో గందరగోళం

ZCZC
PRI ESPL NAT WRG
.MUMBAI BES43
MH-RAHATKAR-RESIGNS
Maha women's commission chief Vijaya Rahatkar resigns
         Mumbai, Feb 4 (PTI) Maharashtra State Commission for
Women chairperson Vijaya Rahatkar on Tuesday tendered her
resignation from the post.
         She submitted her resignation to Chief Uddhav
Thackeray.
         Rahatkar is the president of the BJP Mahila Morcha and
her resignation comes against the backdrop of the Bombay High
Court's observation regarding her continuance on the post
despite change in government in the state.
         The Maharashtra State Commission for Woman was set up
on January 25, 1993 and consists of the chairperson, six non-
official members, a member-secretary and the state director
general of police as ex-officio member. PTI MR
BNM
BNM
02042306
NNNN
Last Updated : Feb 29, 2020, 5:42 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.