అఫ్గానిస్థాన్‌లో సుస్థిర శాంతిని నెలకొల్పే ఉద్దేశంతో అమెరికా, తాలిబన్ల మధ్య కుదిరిన చరిత్రాత్మక ఒప్పందంపై భారత్ హర్షం వ్యక్తం చేసింది. అఫ్గానిస్థాన్‌లో హింసను అంతం చేసి శాంతి, స్థిరత్వం నెలకొల్పేందుకు అన్ని విధాల మద్దతుగా నిలవడమే తమ విధానమని స్పష్టం చేసింది. పొరుగువారిగా... అఫ్గానిస్థాన్ సంపన్న భవిష్యత్ కోసం, అక్కడి ప్రజల ఆకాంక్షల సాకారం కోసం తోడ్పడతామని భారత్ పేర్కొంది.
శాంతిస్థాపనకు నాంది
దశాబ్దాలుగా యుద్ధంతో అతలాకుతలమైన అఫ్గానిస్థాన్‌లో సుస్థిర శాంతిని నెలకొల్పేందుకు అమెరికా-తాలిబన్ల మధ్య చరిత్రాత్మక ఒప్పందం కుదిరింది. ఖతార్ రాజధాని దోహాలో యూఎస్-తాలిబన్ ప్రతినిధులు ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. దీనితో అఫ్గానిస్థాన్ నుంచి 14 నెలల్లోపు మొత్తం బలగాలను అమెరికా, దాని మిత్రదేశాలు ఉపసంహరించుకోనున్నాయి.
ఇదీ చూడండి: యుద్ధభూమిలో శాంతిస్థాపనే ధ్యేయంగా చారిత్రక ఒప్పందం