ఐక్యరాజ్య సమితి(యూఎన్) భద్రతామండలిలో భారత శాశ్వత సభ్యత్వం అంశంపై చర్చించాల్సి ఉందని.. ఐరాసలో అమెరికా రాయబారిగా ఎంపికైన లిండా థామస్ గ్రీన్‌ఫీల్డ్ అభిప్రాయపడ్డారు. ఆమెను ఇటీవలే.. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఎంపిక చేశారు.
అగ్రరాజ్యాన్ని పాలించిన గత మూడు ప్రభుత్వాలు భద్రతామండలిలో.. భారత శాశ్వత సభ్యత్వానికి మద్దతు పలికాయి. డొనాల్డ్ ట్రంప్, జార్జ్ డబ్ల్యూ బుష్, బరాక్ ఒబామాలు.. తమ హయాంలో ఈ అంశంపై బహిరంగ మద్దతు ప్రకటించారు. అయితే.. తాజాగా లిండా థామస్ గ్రీన్‌ఫీల్డ్ ఈ అంశంపై.. చర్చించాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. సెనెట్ విదేశీ వ్యవహారాల కమిటీ ముందు థామస్ గ్రీన్‌ఫీల్డ్ ఈ అభిప్రాయం వ్యక్తం చేశారు. భద్రతామండలిలో సంస్కరణలు జరగాల్సిన అవసరముందని ఆమె పేర్కొన్నారు.
ఇదీ చదవండి:తొలి ప్రైవేటు అంతరిక్షయాత్ర.. టికెట్టు ఎంతో తెలుసా?