రొమ్ము క్యాన్సర్ బారిన పడే వారిలో.. భారత్-పాకిస్థాన్‌కు చెందిన మహిళలు ఎక్కువగా ఉన్నట్లు అమెరికా నేషనల్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ సర్వేలైన్స్ పరిశోధకులు వెల్లిడించారు. ఎపిడెమియాలజీ అండ్ ఎండ్ రిజల్ట్ ప్రోగ్రాంలో భాగంగా భారత్- పాకిస్థాన్, ఆంగ్లో-అమెరికన్లపై ఈ సర్వే ప్రధానంగా సాగింది.
సర్వేలో వెలుగు చూసిన పలు అంశాలను ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ క్యాన్సర్‌లో ప్రచురించారు పరిశోధకులు. 1990 నుంచి 2014 వరకు ఉన్న డేటా ఆధారంగా పరిశోధన జరిగినట్లు సెంటర్ ఫర్ సౌత్ ఏసియన్ క్వాంటిటేటివ్ హెల్త్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ జయా సతగోపన్ తెలిపారు. ఇందులో 4,900 మంది భారతీయ- పాకిస్థానీ మహిళలు, ఆంగ్లో అమెరికన్లు సుమారు ఐదు లక్షల వరకు పాల్గొన్నారు.
సర్వేలోని ముఖ్యాంశాలు
- రొమ్ము క్యాన్సర్ బారిన పడే వారిలో దక్షిణాసియా ప్రజలే అధికం.
- దక్షిణాసియాలో ఈ వ్యాధి గురించి, లక్షణాల గురించి తెలిసినవారు చాలా తక్కువ.
- భారత్-పాకిస్థాన్ మహిళలు చిన్న వయస్సులోనే బ్రేస్ట్ క్యాన్సర్ బారినపడుతున్నారు.
- ఆంగ్లో ఆమెరికన్లతో పోల్చితే దక్షిణాసియా వారిలో రొమ్ము క్యాన్సర్‌తో ఇబ్బంది పడేవారు తక్కువ ఉన్నప్పటికీ.. గత కొద్ది సంవత్సరాలుగా వీరి సంఖ్య విపరీతంగా పెరిగింది.
- ఆంగ్లో అమెరికన్లతో పోల్చితే.. ఈ వ్యాధి కారణంగా భారత్-పాక్ దేశాల్లో మరణించేవారి సంఖ్య తక్కువ.
- రొమ్ము క్యాన్సర్‌ను గుర్తించేందుకు నిర్వహించే పరీక్షల్లో పాల్గొనే భారత్-అమెరికా మహిళల సంఖ్య తక్కువ.
- భారత్-పాకిస్థాన్‌లో రొమ్ము క్యాన్సర్‌ను గుర్తించే పరీక్షలు కూడా తక్కవగా జరుగుతున్నాయి. కుటుంబ మద్దతు, రవాణా వ్యవస్థ, భయం, దేవునికి సంబంధించిన నమ్మకాలు, బయట వ్యక్తులకు తెలుస్తుందనే సిగ్గు.. వంటివి ఇందుకు కారణాలు.
అధ్యయనంలో వెల్లడైన అంశాల ప్రకారం.. భారత్, పాకిస్థాన్ దేశాల్లో మహిళలు రొమ్ము క్యాన్సర్ పరీక్షలకు సామాజిక పరిస్థితులు అవరోధంగాా నిలుస్తున్నట్లు స్పష్టమైందని పరిశోధకులు చెప్తున్నారు. ఈ తాజా పరిశోధనలతో.. రొమ్ము క్యాన్సర్‌కు దారితీస్తున్న కారణాలను అర్థం చేసుకోవడం సహా భవిష్యత్‌లో మెరుగైన పరిశోధనలు జరిపేందుకు వీలు కలిగిందని జయా సతగోపన్ తెలిపారు.