భారతీయ-అమెరికన్ మహిళ అమెరికా ఎన్నికల బరిలో నిలవనున్నారు. డాక్టర్ హిరల్ తిపిర్నేని
అరిజోనా నుంచి డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థిగా ఎంపికయ్యారు. రిపబ్లిక్ పార్టీ కంచుకోటగా పరిగణించే ఆ స్థానంలో.. భారతీయ సంతతి హిరల్కు విశేష ఆదరణ లభిస్తోంది. ప్రత్యర్థి, రిపబ్లికన్ పార్టీ ప్రస్తుత సభ్యుడు డేవిడ్ ష్వీకెర్ట్.. హిరల్కన్నా కేవలం 3 శాతం ఓట్లతో ఆధిక్యంలో ఉన్నట్లు ముందస్తు సర్వేలు స్పష్టంచేస్తున్నాయి.
హిరల్ వృత్తిరీత్యా వైద్యురాలు. మూడేళ్ల వయసులో ఉన్నప్పుడు అమెరికాలో స్థిరపడ్డారు ఆమె తల్లిదండ్రులు. అక్కడే పెరిగి పెద్దయిన హిరల్.. భర్త డాక్టర్ కిశోర్‌తో కలిసి 23 ఏళ్లుగా అరిజోనాలో ఉంటున్నారు. వారికి ముగ్గురు పిల్లలు.
ఇప్పుడు అరిజోనా 6వ కాంగ్రెసనల్ జిల్లా అభ్యర్థిగా ఎంపికైన హిరల్కు మద్దతుగా.. ప్రముఖ డెమొక్రటిక్ నేతలు సహా కాలిఫోర్నియాకు చెందిన భారతీయ అమెరికన్ సెనేటర్ కమలా హ్యారిస్ ప్రచారం చేస్తున్నారు.
ఇదీ చదవండి: ఆడపిల్ల పుట్టిందని అమ్మానాన్నే బావిలో పడేశారు