ETV Bharat / international

భారతీయ అమెరికన్‌ కుర్రాడు.. బైడెన్‌ ప్రచారాన్ని హోరెత్తించాడు!

జో బైడెన్​ను విజయ తీరాలకు చేర్చడంలో మరపురాని పాత్ర పోషించారు భారతీయ అమెరికన్​ కుర్రాడు అమిత్​ జానీ. బైడెన్​ ప్రచార బృందంలో కీలక విభాగానికి డైరెక్టర్​ హోదాలో సారథ్యం వహించారు. ఆయన అధ్యక్ష అభ్యర్థిగా ఎంపికవడంలోనే కాదు.. ఆసియన్​ ఓటర్లలో 71 శాతం మంది బైడెన్​ వైపు మొగ్గచూపేలా చేసి ఆయన్ను అధ్యక్ష పీఠానికి చేరువచేయడంలోనూ విజయం సాధించారు.

Indian American boy .. wide publicity for Biden
భారతీయ అమెరికన్‌ కుర్రాడు.. బైడెన్‌ ప్రచారాన్ని హోరెత్తించాడు!
author img

By

Published : Nov 13, 2020, 6:31 AM IST

మూడు పదుల వయసున్న ఓ భారతీయ అమెరికన్‌ కుర్రాడు అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో చురుకైన పాత్ర పోషించారు. డెమొక్రాటిక్‌ అభ్యర్థి జో బైడెన్‌ బృందంలో కీలక బాధ్యతలు చేపట్టి ఆసియన్‌ అమెరికన్లను ఏకతాటిపై నడిపించారు. బైడెన్‌ను విజయ తీరాలకు చేర్చడంలో మరపురాని పాత్ర పోషించారు. అతడే అమిత్‌ జానీ. గుజరాత్‌లోని రాజ్‌కోట్‌కు చెందిన 30 ఏళ్ల అమిత్‌ జానీ.. బైడెన్‌ ప్రచార బృందంలో ‘నేషనల్‌ ఆసియన్‌ అమెరికన్‌ అండ్‌ పసిఫిక్‌ ఐలాండర్‌’ విభాగానికి డైరెక్టర్‌ హోదాలో సారథ్యం వహించారు. అమెరికాలో నివసిస్తున్న 50 ఆసియన్‌ పసిఫిక్‌ జాతుల ఓటర్లు బైడెన్‌ వైపు ఆకర్షితులయ్యేలా వ్యూహాలు రచించారు. ఇందుకోసం అమెరికాలో గతంలో ఎవరూ చేయని రీతిలో జాతీయ స్థాయిలో ఓ ప్రచార విధానాన్ని రూపొందించారు. అందులో 14 ఆసియా పసిఫిక్‌ జాతులను భాగం చేయడంతోపాటు కీలక రాష్ట్రాల్లో నాయకత్వ మండళ్లను ఏర్పాటు చేశారు. సౌత్‌ ఆసియన్స్‌ ఫర్‌ బైడెన్‌ బృంద రూపకల్పనలో సహకారం అందించారు. దీని సారథ్యంలో బైడెన్‌కు మద్దతునిచ్చే ఇండియన్‌ అమెరికన్లు, హిందువులు, సిక్కులు, జైనులు తదితర వర్గాలను సంఘటితం చేశారు. ఆగస్టు 15న అమెరికా వ్యాప్తంగా ఉన్న ప్రముఖ భారతీయ అమెరికన్ల నేతృత్వంలో భారీ వర్చువల్‌ ఈవెంట్‌ నిర్వహించారు. ఇది అత్యధిక మంది వీక్షించిన కార్యక్రమంగా నిలిచింది. ప్రైమరీ ఎన్నికల సమయంలో బైడెన్‌ బృందంలో చేరిన అమిత్‌.. ఆయన అధ్యక్ష అభ్యర్థిగా ఎంపికవడంలోనే కాదు.. ఆసియన్‌ ఓటర్లలో 71 శాతం మంది బైడెన్‌ వైపు మొగ్గుచూపేలా చేసి ఆయన్ను అధ్యక్ష పీఠానికి చేరువచేయడంలోనూ విజయం సాధించారు.

టాస్క్‌ఫోర్స్‌లో భారతీయ అమెరికన్‌కు చోటు

అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్‌.. కరోనాను కట్టడి చేసేందుకు ప్రత్యేక కార్యదళాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ టాస్క్‌ ఫోర్స్‌లో భారతీయ అమెరికన్‌ డాక్టర్‌ సెలిన్‌ గౌండర్‌కి స్థానం కల్పించారు. సెలిన్‌ గౌండర్‌ తండ్రి రాజ్‌ది తమిళనాడు. ఆయన అమెరికాకు వలస వెళ్లాక సెలిన్‌ అక్కడే పుట్టి పెరిగారు. అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా, క్షయ నివారణ విభాగంలో డిప్యూటీ డైరెక్టర్‌గా సేవలందిస్తున్నారు.

రుజువులు లేవన్న ట్రంప్‌ న్యాయవాదులు

ఫిలడెల్ఫియా: ఎన్నికల్లో కుట్ర జరిగిందంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ చేస్తోన్న ఆరోపణలకు ఆధారాలు చూపాలని పెన్సిల్వేనియాలోని ఫెడరల్‌ కోర్టు కోరింది. ట్రంప్‌ తరపున దాఖలైన వ్యాజ్యాలపై విచారించిన కోర్టు.. మోసాలకు సంబంధించి రుజువులున్నాయా అని ప్రశ్నించింది. దీంతో ట్రంప్‌ న్యాయవాదులు ‘లేవు’ అనే సమాధానం చెప్పారు. మిషిగన్‌, జార్జియా రాష్ట్రాల్లోని కోర్టులు ఇదే తరహా వ్యాజ్యాలను ఇప్పటికే కొట్టివేశాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.