ETV Bharat / international

'వైట్​హౌస్ ఫెలో'గా భారత సంతతి మహిళ

ఈ ఏడాది 'వైట్​హౌస్​ ఫెలో' జాబితాలో భారత సంతతి మహిళ పియా దాండియాకు చోటు దక్కింది. 2020-21 ఏడాదికి గాను ఎంపికైన 14 మందిలో ఒకరిగా నిలిచారు. ఆమెను విద్యాశాఖలో నియమించినట్లు శ్వేతసౌధం ప్రకటించింది.

author img

By

Published : Nov 7, 2020, 10:02 AM IST

US-WH-INDIAN
వైట్​హౌస్ ఫెలో

అమెరికాలో భారత సంతతి మహిళ పియా దాండియాకు అపూర్వ గౌరవం లభించింది. 2020-21 ఏడాదికి గాను 'వైట్​హౌస్ ఫెలో'గా ఎంపికైన 14 మందిలో ఆమెకు చోటు దక్కింది.

విద్యా శాఖలో దాండియాను నియమించినట్లు శ్వేతసౌధం ప్రకటించింది. దాండియా నిర్వహిస్తున్న విద్యాసంస్థ దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నవారికి విద్యనందించటంలో విశేష కృషి చేసిందని శ్వేతసౌధం ప్రకటనలో తెలిపింది.

ప్రస్తతం న్యూయార్క్​లోని హర్లీమ్​లో డెమొక్రసీ ప్రెప్​ ఎండ్యురెన్స్ హైస్కూల్​కు వ్యవస్థాపక ప్రిన్సిపల్​గా వ్యవహరిస్తున్నారు దాండియా. 28 ఏళ్లకే బాధ్యతలు స్వీకరించి పిన్న వయస్కురాలైన ప్రిన్సిపల్​గా నిలిచారు.

జాన్సన్​ ఆలోచనతో..

అమెరికా మాజీ అధ్యక్షుడు లిండన్​ జాన్సన్​.. 1964లో 'వైట్​హౌస్ ఫెలోషిప్' కార్యక్రమాన్ని ప్రారంభించారు. దీని ద్వారా యువత, మహిళలకు ఫెడరల్ ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు అవకాశం కల్పిస్తారు. జాతీయ వ్యవహారాల్లో ఉన్నత స్థాయి అనుభవం కల్పించేందుకు ఈ ఏర్పాటు చేశారు. వీరి ఫెలోషిప్ ఏడాది కాలం ఉంటుంది.

ఈ కార్యక్రమాన్ని పార్టీలతో సంబంధం లేకుండా.. డెమొక్రాట్, రిపబ్లికన్ ప్రభుత్వాలు సంప్రదాయంగా ఆచరిస్తున్నాయి. పౌరులకు ప్రోత్సాహం, దేశానికి సేవ చేయటం ఈ మిషన్​ ప్రధాన ఉద్దేశం.

ఇదీ చూడండి: నీవూ అధ్యక్షురాలివి కావొచ్చు: కమలా హారిస్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.