Biden on India: ఉక్రెయిన్‌పై దండయాత్ర చేస్తున్న రష్యాపై చర్యలు తీసుకునేందుకు భారత్ ఎందుకో వణుకుతోందని అమెరికా అధ్యక్షుడు బైడెన్ వ్యాఖ్యానించారు. అమెరికా మిత్ర దేశాల్లో భారత్ మాత్రమే మాస్కోపై ఆంక్షలకు భయపడుతోందన్నారు. ఉక్రెయిన్‌పై రష్యా దాడికి వ్యతిరేకంగా మద్దతు తెలిపే విషయంలో భారత్ అస్థిరంగా ఉందని, ఈ విషయంలో అమెరికా మిత్ర దేశాలన్నీ ఐక్యంగా ముందుకు వచ్చాయని బైడెన్ తెలిపారు. క్వాడ్‌లో భారత్ మాత్రమే రష్యాపై కఠినంగా లేదని, జపాన్, ఆస్ట్రేలియా, అమెరికా మాత్రం తీవ్ర ఒత్తిడి తెస్తున్నాయని పేర్కొన్నారు. ఈమేరకు ఆయన సీఈఓల బిజినెస్ రౌండ్ టేబుల్ త్రైమాసిక సమావేశంలో సోమవారం మాట్లాడారు.
Joe Biden News
క్వాడ్‌లో భారత్, అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్ సభ్య దేశాలు. అయితే మిగతా మూడు దేశాలు రష్యాపై కఠిన ఆంక్షలు విధిస్తున్నప్పటికీ భారత్ మాత్రం తటస్థ వైఖరి అవలంబిస్తోంది. రష్యా, ఉక్రెయిన్ చర్చలు, దౌత్యపరంగా సమస్యలు పరిష్కరించుకోవాలని సూచించింది. శాంతి బాటలో నడవాలని చెప్పింది. రష్యాకు వ్యతిరేకంగా ఐక్యరాజ్య సమితిలో ఓటింగ్ జరిగినప్పుడు కూడా భారత్ దూరంగా ఉంది. ఈ నేపథ్యంలోనే బైడెన్ కీలక వ్యాఖ్యలు చేశారు.
ఇదీ చదవండి: అణు వార్హెడ్లు బయటకు తీసిన బ్రిటన్- పుతిన్ బెదిరింపులే కారణమా?