కరోనా వైరస్‌ను అంతమొందించే విషయంలో భారత్ తప్పుడు లెక్క వేయడం వల్లనే ఇప్పుడు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటోందని 'అమెరికా జాతీయ అలర్జీ, అంటువ్యాధుల సంస్థ' డైరెక్టర్, అధ్యక్షుని ముఖ్య వైద్య సలహాదారుడు డాక్టర్ ఆంటోనీ ఫౌచీ పేర్కొన్నారు. ఇక కరోనా బెడద లేదనుకుని వ్యవస్థలన్నింటినీ తెరవడం వల్లనే ప్రస్తుతం ఈ పరిస్థితులు ఎదురవుతున్నాయని సెనెట్‌లోని సంబంధిత కమిటీకి మంగళవారం ఆయన చెప్పారు.
"పరిస్థితిని ఎన్నడూ తక్కువగా అంచనా వేయకూడదనేది భారత్ అనుభవం చెబుతోంది. ప్రజారోగ్యం పరంగా అవసరమైన సన్నద్ధత గురించి దీని ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఆరోగ్యరంగ మౌలిక సదుపాయాలను విస్తరించుకుంటూ వెళ్లాలి. ప్రపంచంలో ఎక్కడ ఇలాంటి వైరస్ ఉన్నా అది అమెరికాకూ ముప్పు తెస్తుంది" అని ఫౌచీ వివరించారు.
ఇవీ చదవండి: