ఐక్యరాజ్య సమితి అభివృద్ధి భాగస్వామ్య నిధికి 15.46 మిలియన్ డాలర్లను(సుమారు రూ. 115 కోట్లు) విరాళంగా అందించినట్లు భారత్ పేర్కొంది. ఈ మేరకు ఐరాస సౌత్ కోఆపరేషన్ డైరెక్టర్ జార్జ్ చెడిక్కు దీనికి సంబంధించిన చెక్కును భారత రాయబారి టి.ఎస్ తిరుమూర్తి అందజేశారు.
సుస్థిర లక్ష్యాలతో అభివృద్ధి చెందుతున్న దేశాలకు ప్రాధాన్యమివ్వడానికి ఈ నిధి సహకరిస్తుందని భారత్ పేర్కొంది. ఈ నిధిని యునెస్కో నిర్వహిస్తోంది.