హెచ్-1బీ వీసాలపై ఉన్న ఆంక్షలను సడలించాలని అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్‌ను కోరింది భారత-అమెరికా వాణిజ్య బృందం. దేశంలో పెరుగుతున్న ఐటీ నిపుణుల డిమాండ్‌కు అనుగుణంగా సైన్స్, మ్యాథమెటిక్స్ డిగ్రీ ఉన్నత విద్యార్థులకు గ్రీన్ కార్డులు అందించాలని విజ్ఞప్తి చేసింది.
'ట్రంప్ ఇమ్మిగ్రేషన్ విధానాలు చాలా కఠినంగా ఉన్నాయి. అధికారంలోకి రాగానే వీటిని రద్దు చేస్తాం. హెచ్-1బీ వీసాలపై ఉన్న ఆంక్షలను సరళతరం చేస్తాం' అని గతంలో బైడెన్ హామీ ఇచ్చిన నేపథ్యంలో ఈమేరకు అభ్యర్థించింది.
హెచ్-1బీ వీసా విషయంలో ఉన్న ఆంక్షలను తగ్గించాలని బైడెన్‌ను విజ్ఞప్తి చేశాం. అలాగే.. సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథమెటిక్స్ విద్యార్థులకు గ్రీన్‌కార్డులు ఇవ్వాలని కోరాము. తద్వారా వారు పన్ను చెల్లించడానికి అవకాశం ఉంటుంది. ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి వారు తోడ్పడతారు.
- ముకేశ్ అఘి, యూఎస్-ఇండియా వ్యూహత్మక ఫోరం అధ్యక్షుడు.
ప్రస్తుతం అమెరికాలో పది లక్షల ఐటీ నిపుణుల కొరత ఉందని.. అదే సమయంలో స్థానికులకు ఉద్యోగాలు కల్పించాల్సిన బాధ్యత ఉందని అఘి పేర్కొన్నారు.
ఈ హెచ్-1బీ వీసాల జారీని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గత డిసెంబర్ 31న నిలిపివేశారు. ఆ ఆంక్షలను మార్చి 31 వరకు పొడిగించారు.
ఇదీ చదవండి: పొరపాటున దేశం దాటి.. 11 ఏళ్లకు ఇల్లు చేరి...