ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్తో భేటీ సమగ్రంగా, ఫలప్రదంగా జరిగిందన్నారు విదేశాంగ మంత్రి ఎస్.జై శంకర్. మంగళవారం ప్రత్యక్షంగా ఈ సమావేశం జరిగింది. ఈ భేటీలో భారత్కు పొరుగు దేశాలతో సవాళ్లు, ఉగ్రవాదం, మయన్మార్ సహా ఆగస్టులో ఐరాస భద్రతా మండలికి అధ్యక్షత వహించే సమయంలో దేశ ప్రాధాన్యతలపై చర్చించినట్లు ట్విట్టర్లో జై శంకర్ వెల్లడించారు.
వాతావరణ మార్పులపైనా ఈ భేటీలో చర్చించినట్లు జైశంకర్ వెల్లడించారు. అయితే అందుకోసం ఎన్ని నిధులు వెచ్చించామనే అంశం మన నిబద్ధతను తెలియజేస్తుందని పేర్కొన్నారు. సముద్ర యాన భద్రత, శాంతి స్థాపనకు సాంకేతికత వినియోగం ప్రస్తుత అవసరాలని చెప్పారు.
ఇదీ చదవండి: సీబీఐ డైరెక్టర్గా సుబోద్ కుమార్ జైస్వాల్