భారత స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ ఆగస్టు 15న అమెరికాలోని ప్రఖ్యాత న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ వద్ద మువ్వన్నెల జెండా రెపరెపలాడనుంది. ఈ మేరకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. న్యూయార్క్, న్యూజెర్సీ, కనెక్టికట్‌కు చెందిన ప్రవాస భారతీయులు ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు.
న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ చరిత్రలో భారతీయ జాతీయ జెండా రెపరెపలాడనుండడం ఇదే ప్రథమం కాగా.. తాము కొత్త చరిత్ర లిఖించినున్నట్లు అమెరికాలోని భారతీయ కూటముల సమాఖ్య(ఎఫ్ఐఏ)తెలిపింది. ఆగస్టు 14న ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ దీపకాంత ధగధగలతో వెలిగిపోనుంది.