ETV Bharat / international

అధ్యక్ష ఎన్నికల ముందే భారత్​తో ట్రేడ్ డీల్!

author img

By

Published : Jul 16, 2020, 5:22 PM IST

భారత్-చైనా ఉద్రిక్తతలు, అమెరికా- చైనా వాణిజ్య విభేదాల మధ్య భారత్​- అమెరికా బంధం ఎలా ఉండనుంది? డిజిటలైజేషన్ కోసం భారత్​లో గూగుల్ 10 బిలియన్ డాలర్లు పెట్టుబడులుగా పెట్టడానికి కారణమేంటి? త్వరలో భారత్-అమెరికా మధ్య జరగనున్న సదస్సులో నేతలు చర్చించే అంశాలేంటి? ఈటీవీ భారత్​తో ప్రత్యేకంగా మాట్లాడిన అమెరికా ఇండియా బిజినెస్ కౌన్సిల్ అధ్యక్షురాలు నిషా బిస్వాల్.. ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు ఇచ్చారు.

Immigration has benefitted US, turning inwards wrong- USIBC President
అధ్యక్ష ఎన్నికల ముందే భారత్​తో వాణిజ్య ఒప్పందం!

భారత్​, అమెరికా దేశాల మధ్య అధ్యక్ష ఎన్నికలకు ముందే చిన్నస్థాయి వాణిజ్య ఒప్పందం జరిగే అవకాశం లేకపోలేదని మాజీ దౌత్యవేత్త, అమెరికా ఇండియా బిజినెస్ కౌన్సిల్(యూఎస్ఐబిసీ) అధ్యక్షురాలు నిషా బిస్వాల్ పేర్కొన్నారు. ఈటీవీ భారత్​ ముఖాముఖిలో భాగంగా సీనియర్ జర్నలిస్ట్ స్మితా శర్మతో మాట్లాడిన నిషా... ట్రంప్ వలస విధానాలపై విమర్శలు చేశారు. హెచ్​1బీ, ఎల్1 వీసాలు నిలిపివేయడం, ఎఫ్​1 వీసాదారులైన విదేశీ విద్యార్థులను అమెరికా విడిచి వెళ్లాలనే ఆదేశాలను తప్పుబట్టారు. వలసదారులపై వేటు వేయడం వల్ల అమెరికా ఆర్థిక వ్యవస్థ నష్టపోతుందని అన్నారు.

ఒబామా హయాంలో విదేశాంగ(దక్షిణ మధ్యాసియా విభాగం) సహాయ మంత్రిగా పనిచేశారు బిస్వాల్. భారత్​లో 10 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టాలని గూగుల్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించారు. కొవిడ్ ప్రభావం తర్వాత డిజిటల్ ఆర్థిక వ్యవస్థదే భవిష్యత్తు అని పేర్కొన్నారు. ఇండో-అమెరికా వాణిజ్య సంబంధాలు రాబోయే ఏళ్లలో మరింత బలపడతాయని పేర్కొన్నారు. అయితే భారత్​లో స్థిరమైన విధానపర ఫ్రేమ్​వర్క్​ రూపొందించాల్సిన అవసరం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు.

నిషా బిస్వాల్​తో ముఖాముఖి

భారత్, అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం త్వరలో ఖరారయ్యే అవకాశం ఉందా?

అమెరికా వాణిజ్య శాఖ ప్రతినిధి రాబర్ట్ లైట్​హైజర్, భారత వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్​ బృందాల మధ్య జరుగుతున్న విస్తృతమైన చర్చల్లో మినీ వాణిజ్య ఒప్పందం ఒకటి. సమస్యలు ఏవైనా ఉంటే వాటిని అధిగమించేందుకు చర్చలు జరుగుతున్నాయి. ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ ఇది పూర్తయ్యే అవకాశాలు తక్కువగా మారే అవకాశం ఉంది. అయితే ఇరు దేశాలు వీలైనంత త్వరగా ఒప్పందాన్ని పూర్తి చేయడానికి ప్రయత్నిస్తున్నాయి. ఎన్నికలకు ముందే ఇది జరిగితే నేను ఆనందంగా ఆశ్యర్చపోతాను.

అమెరికా- చైనా మధ్య వాణిజ్య విభేదాలు, భారత్​-చైనా మధ్య సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా-భారత్ మధ్య ఉన్న వాణిజ్య అవకాశాలేంటి?

భారత్​లో సప్లై చైన్, తయారీ రంగంపై ప్రత్యేక దృష్టికోణంతో ఇరుదేశాల మధ్య ఆర్థిక భాగస్వామ్యాన్ని మరింత పెంపొందించుకునే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఔషధాలు, అధునాతన సాంకేతికత, మౌలిక వసతుల కల్పన, రక్షణ రంగాల్లో భాగస్వామ్యం దృఢపర్చుకోవాలి.

భారత్, అమెరికాకు చైనా ఎప్పుడూ చాలా ముఖ్యమైన ఆర్థిక భాగస్వామిగానే ఉంటుంది. దీన్ని ఎవరూ మార్చలేరు. అయితే సప్లై చైన్​లో వైవిధ్యం సహా కొన్ని రంగాల్లో ముప్పును తగ్గించుకోవడానికి భారత్​లో స్థిరమైన, పెట్టుబడిదారులకు అనుకూలమైన ఫ్రేమ్​వర్క్ రూపొందించాల్సిన అవసరం ఉంది. కానీ ఇది దీర్ఘకాలంలో జరగాల్సిన విషయం. ప్రస్తుతం చాలా కంపెనీలు నష్టాల్లో ఉన్నాయి. భారీ పెట్టుబడులకు ఇది సమయం కాదు.

గల్వాన్ ఘర్షణ తర్వాత కొన్ని చైనా వస్తువుల దిగుమతిపై భారత్ నిషేధం విధించడం వల్ల గందరగోళం తలెత్తింది. దీని వల్ల అమెరికా తయారీ సంస్థలు సైతం నష్టపోతాయని అమెరికా-భారత్ వ్యూహాత్మక భాగస్వామ్య ఫోరం అభిప్రాయం వ్యక్తం చేసింది. దీనిపై మీరేమంటారు?

ఇవి చాలా చిన్న సమస్యలు. భారత ప్రభుత్వ భద్రతా సమస్యలను మేం అర్థం చేసుకున్నాం. వారికి మద్దతు ఇస్తున్నాం. కానీ మనం సమగ్రమైన ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో జీవిస్తున్నాం కాబట్టి అనాలోచిత పరిణామాలను దృష్టిలో పెట్టుకొని కార్యాచరణ రూపొందించుకోవాలి.

భారత డిజిటల్ ఆర్థిక వ్యవస్థను మరింత వేగవంతంగా మార్చడానికి 10 బిలియన్ డాలర్లు పెట్టబడిగా పెట్టనున్నట్లు గూగుల్ ప్రకటించింది. ఇదే బాటలో మరిన్ని అమెరికన్ సంస్థలు వస్తాయని మీరు భావిస్తున్నారా?

కచ్చితంగా. భవిష్యత్తు డిజిటల్​ రంగానిదే. డిజిటల్ ఆర్థిక వ్యవస్థ వేగంగా అభివృద్ధి చెందుతోంది. డిజిటలైజేషన్ ప్రక్రియను మహమ్మారి మరింత వేగవంతం చేసింది. గూగుల్​, మైక్రోసాఫ్ట్​ సహా భారత్​లోని టెక్ దిగ్గజాలు సైతం డిజిటల్ వ్యవస్థను మరింత విస్తరించడానికే ప్రయత్నిస్తున్నాయి. ఈ ప్రయత్నాలన్నీ భారత్- అమెరికా మార్కెట్ల మధ్య సమన్వయం పెంచేందుకు దోహదపడతాయి.

హెచ్​1బీ, ఎల్1 వీసాలపై డిసెంబర్​ వరకు విధించిన తాత్కాలిక నిషేధం కొనసాగే అవకాశం ఉందా? సిలికాన్ వ్యాలీపై ఈ ప్రభావం ఎలా ఉంటుంది.?

ట్రంప్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తప్పుదోవ పట్టించేదిగా ఉందని అమెరికా ఛాంబర్ ఆఫ్ కామర్స్​ సీఈఓ టామ్ డొనొహూ సైతం అసంతృప్తి వ్యక్తం చేశారు. నిజానికి దశాబ్దాలుగా దేశానికి వచ్చిన ప్రజల వల్ల అమెరికా చాలా లాభపడింది. మంచి జీవితం కోసం ఇక్కడ స్థిరపడేందుకు వచ్చినవారైనా, చదువుకోవడానికి వచ్చిన విద్యార్థులైనా, కొద్దికాలం పాటు అమెరికా ఆర్థిక వ్యవస్థలో పనిచేసేందుకు వచ్చిన ఉద్యోగులైనా వీరంతా అమెరికా ఆర్థిక వ్యవస్థ వృద్ధికి దోహదపడ్డారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అత్యుత్తమ సామర్థ్యాలను అమెరికాలోకి రానీయకుండా అడ్డుకుంటే అది ఇతర దేశాలకే ప్రయోజనం చేకూర్చుతుంది.

ఈ విధానాల విషయంలో కార్యనిర్వాహక వర్గం ఉద్దేశం గురించి నేను మాట్లాడలేను. కరోనా వల్ల వైద్య వ్యవస్థతో పాటు ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావమనే రెండు భయాలను మనం ఎదుర్కొంటున్నాం. ఇన్ని ఉద్యోగాలు కోల్పోతున్న సమయంలో ఇలాంటి నిర్ణయాలు తప్పు అని మేం భావిస్తున్నాం. ప్రపంచదేశాలు, భాగస్వాములతో సమన్వయంతో ఉంటే మరింత మెరుగ్గా పనిచేయవచ్చు. మార్కెట్లు, వనరులు, ప్రతిభ ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి. ఈ విషయంలో అడ్డంకులు ఏర్పరచడం మంచిది కాదు.

యూఎస్​ఐబీసీ నిర్వహించే ద ఐడియాస్ ఇండియా సదస్సు త్వరలో జరగనుంది. కొవిడ్ తర్వాతి పరిస్థితుల్లో భారత్-అమెరికా దేశాల మధ్య సహకారంపై నిర్మలా సీతారామన్, జయ్​శంకర్, మైక్ పాంపియో చర్చించనున్నారు. ఇందులో ముఖ్యమైన విషయాలేంటి?

'మంచి భవిష్యత్తు నిర్మించడం' అనేది ఈ సదస్సు ఇతివృత్తం. భవిష్యత్తు కోసం భారత్ అమెరికా ఎలాంటి భాగస్వామ్యంతో పనిచేస్తాయని చర్చించుకోవడానికి ఐడియా సదస్సు నిర్వహిస్తున్నారు. సముద్ర మార్గాలను వాణిజ్యానికి తెరిచి ఉంచే విధంగా భద్రతా పరమైన చర్చలు సహా వ్యూహాత్మక భాగస్వామ్యంపై చర్చలు జరగొచ్చు.

ఇదీ చదవండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.