ETV Bharat / international

'ఇజ్రాయెల్-పాలస్తీనా ఇకనైనా శాంతించాలి'

author img

By

Published : May 17, 2021, 5:11 AM IST

ఇజ్రాయెల్-పాలస్తీనా మధ్య జరుగుతున్న దాడులపై భారత్​ స్పందించింది. ఇరు దేశాలు చర్చలు జరిపి శాంతి నెలకొల్పే దిశగా అడుగులేయాలని ఐరాసలో భారత రాయబారి టీఎస్ తిరుమూర్తి అన్నారు.

TS tirumurti
టీఎస్ తిరుమూర్తి, ఐరాసలో భారత రాయబారి

ఇజ్రాయెల్-గాజా మధ్య జరుగుతున్న పరస్పర దాడులను వెంటనే ఆపేయాలని భారత్​ కోరింది. ఇరుదేశాలు యథాతథస్థితిని నెలకొల్పే ప్రయత్నం చేయాలని సూచించింది. మిడిల్ ఈస్ట్ దేశాల్లో నెలకొన్న పరిస్థితులపై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి(యూఎన్​ఎసీ) ఏర్పాటు చేసిన సమావేశంలో భారత్ ఈ విధంగా మట్లాడింది.

ఇజ్రాయెల్-పాలస్తీనా ఘర్షణలు ప్రస్తుతం హద్దులు మీరుతున్నాయని ఐరాసలో భారత రాయబారి టీఎస్ తిరుమూర్తి అన్నారు. ఈ దాడుల కారణంగా భద్రతకు ముప్పు వాటిల్లుతోందని పేర్కొన్నారు. ఇరు దేశాలు శాంతించాలని కోరారు. తూర్పు జెరూసలెమ్, ఇతర ప్రాంతాల్లో యథాతథస్థితిని నెలకొల్పాలని విజ్ఞప్తి చేశారు. ఇజ్రాయెల్- పాలస్తీనా మరోసారి శాంతియుత చర్చలు జరపాల్సిన అవసరం ఉందని తెలిపారు. కొద్ది రోజులుగా గాజా, వెస్ట్ బ్యాంక్, ఇతర ప్రాంతాల్లో జరుగుతున్న హింసను ఖండించారు.

ఇజ్రాయెల్-పాలస్తీనా దాడులను ఉద్దేశిస్తూ.. ఇది చాలా ప్రమాదాలకు దారితీస్తుందని ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ అభిప్రాయపడ్డారు. వెంటనే దాడులు ఆపివేయాలని కోరారు.

ఇదీ చదవండి:

గాజాపై ఇజ్రాయెల్​ దాడులు- 33 మంది మృతి

'గాజా'పై ఇస్లాం నేతల అత్యవసర సమావేశం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.