ETV Bharat / international

ఐఎంఎఫ్​కు గీత​ గుడ్​బై- మళ్లీ హార్వర్డ్​కే...

author img

By

Published : Oct 20, 2021, 11:50 AM IST

అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ(ఐఎంఎఫ్​)(IMF news) ముఖ్య ఆర్థికవేత్త​ గీతా గోపీనాథ్​.. తన విధుల నుంచి తప్పుకోనున్నారు. గతంలో పని చేసిన హార్వర్డ్​ యూనివర్సిటీకే ఆమె తిరిగి వెళ్లనున్నట్లు అధికారులు తెలిపారు.

IMF Chief Economist Gita Gopinath
ఐఎంఎఫ్​ చీఫ్​ ఎకానమిస్ట్​ గీతా గోపినాథ్​

అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ(ఐఎం​ఎఫ్​) (IMF news) ముఖ్య ఆర్థికవేత్త గీతా గోపీనాథ్​ తన విధుల నుంచి వచ్చే ఏడాది జనవరిలో తప్పుకోనున్నారు. గతంలో పని చేసిన హార్వర్డ్ యూనివర్సిటీకే ఆమె తిరిగి వెళ్లనున్నారు. ఈ మేరకు ఐఎంఎఫ్ ప్రతినిధులు తెలిపారు. అలాగే సంస్థకు కొత్త ముఖ్య ఆర్థికవేత్తను త్వరలోనే ప్రకటించనున్నట్లు ఐఎంఎఫ్​ మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టాలినా జార్జివా(IMF MD) వెల్లడించారు.

"సంస్థకు గీత అందించిన సేవలు చిరస్మరణీయం. ఆమె అంకిత భావంతో విధులు నిర్వహిస్తున్నారు. సంస్థపై ఆమె ఎంతో ప్రభావం చూపారు. పలు ముఖ్య కార్యక్రమాల్లో కీలకంగా వ్యవహరించారు" అని ఆమెను జార్జివా ప్రశంసించారు. ​

ఐఎంఎఫ్(IMF news)​ చీఫ్​ ఎకానమిస్ట్​గా బాధ్యతలు చేపట్టే సమయానికి గీత.. హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో ఎకనామిక్స్ ప్రొఫెసర్‌గా ఉన్నారు.

భారత్​లోని మైసూరులో జన్మించిన గోపీనాథ్​.. ఐఎంఎఫ్​ తొలి మహిళా చీఫ్ ఎకనామిస్ట్​గా నియమితులయ్యారు.

ఇదీ చూడండి: క్వాడ్‌ కొత్త కూటమి.. భారత్‌కు బలిమి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.