ETV Bharat / international

టీకా తీసుకున్నాక సుస్తీ చేస్తే కొవిడ్​ పరీక్ష చేసుకోవాలా? - కరోనా వైరస్​ వ్యాక్సినేషన్

ప్రస్తుత సమయంలో స్వల్ప అనారోగ్యానికి గురైనా.. ఆలోచన వైరస్​ వైపే వెళుతుంది. ఒకవేళ.. కరోనా టీకా తీసుకున్న తర్వాత లక్షణాలు కనిపిస్తే.. ఏం చేయాలి? కొవిడ్​ పరీక్షలు చేయించుకోవాలా? వద్దా? వైద్యులు చెబుతున్నదేమిటి? తెలుసుకుందాం రండి.

virus testing vaccination, కరోనా వైరస్​ వ్యాక్సినేషన్
'అలా ఉంటే టీకా తీసుకున్నా కూడా పరీక్ష చేయించుకోవాల్సిందే'
author img

By

Published : Jun 5, 2021, 4:17 PM IST

ముందు రోజు రాత్రి నుంచి కాస్త జలుబు, గొంతు నొప్పి ఉన్నాయి అనుకోండి.. వెంటనే మనము అది కరోనా ఏమో అన్న అనుమానం వచ్చి పరీక్షలు చేయించుకుంటాం. గత ఏడాదిగా ఇదే పరిస్థితి. అయితే ఇప్పుడు వ్యాక్సినేషన్ విస్తృతం అయింది. చాలా మంది పూర్తిస్థాయిలో టీకాలు తీసుకున్నారు కూడా. రెండు డోసులు తీసుకున్నాక కూడా లక్షణాలు కనిపిస్తే కొవిడ్ టెస్ట్​ చేయించుకోవాలా అనే అనుమానం చాలా మందిలో వ్యక్తం అవుతోంది.

ఈ సందేహాలకు పశ్చిమ వర్జీనియా యూనివర్సిటీలో అసోసియేట్​ ప్రొఫెసర్​గా పనిచేస్తున్న ఆరిఫ్​ ఆర్​ సార్వరీ సమాధానమిచ్చారు. వ్యాక్సిన్ తీసుకున్నా సరే లక్షణాలు ఉంటే కొవిడ్​ టెస్ట్​ చేయించుకోవడం మంచిదని సూచిస్తున్నారు.

వ్యాక్సిన్లు 100 శాతం ప్రభావితం కావు.. ఎందుకంటే?

ప్రస్తుతం ఉన్న వ్యాక్సిన్లు కరోనాతో ఆసుపత్రి పాలవడం, చనిపోవడం మొదలైన వాటి నుంచి మాత్రమే రక్షణ కల్పిస్తాయని సార్వరీ వెల్లడించారు.

  • ఫైజర్​, మోడెర్నా తయారు చేసిన ఎంఆర్​ఎన్​ఏ వ్యాక్సిన్లు ఆసుపత్రి పాలవకుండా, చనిపోకుండా ఉండేలా 90 శాతం రక్షణ కల్పిస్తాయి. కానీ కరోనా సోకే అవకాశాలు ఉన్నాయి.
  • కరోనా సోకకుండా ఎంఆర్​ఎన్​ఏ వ్యాక్సిన్లు 70 నుంచి 85 శాతం రక్షణ కల్పిస్తాయని ఇటీవల పరిశోధన వెల్లడించింది. అయితే వ్యాక్సిన్​ తీసుకున్న వారికి వైరస్​ సోకే అవకాశం ఉందా.. లేక పూర్తిస్థాయి రక్షణ ఉంటుందా అనే విషయంపై స్పష్టత లేదు.
  • ఒకవేళ కరోనా సోకితే టీకా తీసుకున్న వారిపై ప్రభావం చూపకపోయిన.. వైరస్​ వ్యాప్తి చెందే అవకాశాలు ఉన్నాయి.
  • ప్రస్తుతానికి వ్యాక్సిన్లు కొవిడ్​ వేరియంట్లను కూడా ఎదుర్కొంటున్నాయి. కానీ భవిష్యత్తులో మరో కొత్త స్ట్రేయిన్ మ్యుటేట్​ అయ్యి వ్యాక్సిన్లు కూడా పని చేయని సామర్థ్యానికి చేరుకునే అవకాశం ఉంది. కాబట్టీ లక్షణాలు ఉంటే పరీక్షలు చేసుకోవాల్సి అవసరం ఉందనడానికి ఇది మరో బలమైన కారణం. ​

బ్రేక్​త్రూ కేసులు ఏం చెప్తున్నాయి?

పూర్తిస్థాయి వ్యాక్సినేషన్​ పొందినా కూడా వైరస్​ సోకితే దానిని బ్రేక్​త్రూ కేసు అంటారు. ఈ బ్రేక్​త్రూ కేసులు నమోదుకావడానికి రెండు కారణాలు ఉన్నాయి. అవే 'ఇన్​టెన్సిటీ ఆఫ్​ ఎక్స్​పోజర్​', 'ఇమ్మూన్​ కంపీటెన్స్​'.

ఎలాంటి వైరస్​ లేని ఓ వ్యక్తి కరోనా తీవ్ర స్థాయిలో ఉన్న వ్యక్తుల మధ్య ఎంత సేపు ఉంటున్నాడు అనేదే 'ఇన్​టెన్సిటీ ఆఫ్​ ఎక్స్​పోజర్​'. కొవిడ్​ నుంచి ఎంత స్థాయిలో శరీరానికి రక్షణ ఉంటోందనేది 'ఇమ్మూన్​ కంపీటెన్స్​'. ఇప్పటివరకు వైరస్​ సోకని వారికి శరీరానికి నుంచి ఎలాంటి రక్షణ ఉండదు. అదే వ్యాక్సిన్ పొందిన వారిలో రక్షణ ఉంటుంది.

ఈ ఏడాది ఏప్రిల్​ 30 నాటికి కేవలం అమెరికాలోనే 10,262 సార్స్​-కొవ్​-2 వ్యాక్సిన్​ బ్రేక్​త్రూ కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లో బాధితులకు స్వల్ప లక్షణాలు మాత్రమే ఉన్నాయి.

ఇదీ చదవండి : 60శాతం టీకాల పంపిణీ ఆ మూడు దేశాల్లోనే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.