ETV Bharat / international

'బైడెన్​ గెలిస్తే నెలలోపే కమ్యూనిస్ట్​ కమల అధికారం చేపడతారు'

అమెరికా ఉపాధ్యక్ష అభ్యర్థుల మధ్య జరిగన సంవాదంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ స్పందించారు. కమల చాలా భయంకరంగా ఉన్నారని విమర్శించారు. జో బైడెన్​ గనుక ఎన్నికల్లో గెలిస్తే నెలలోపే కమ్యూనిస్ట్ కమల అధికారం చేపడతారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. సైనిక ఆస్పత్రి నుంచి డిశ్ఛార్జి అయిన అనంతరం.. తొలిసారి ఓ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు ట్రంప్​.

if biden wins communist kamala will take over in a month says trump
'బైడెన్​ గెలిస్తే నెలలోపే కమ్యూనిస్ట్​ కమలా అధికారం చేపడుతారు'
author img

By

Published : Oct 9, 2020, 1:58 PM IST

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ మరోసారి ప్రత్యర్థి పార్టీపై విమర్శనాస్త్రాలు సంధించారు. నవంబర్​న 3న జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్​ అభ్యర్తి జో బైడెన్​ గనుక గెలిస్తే.. నెలలోపే కమ్యూనిస్ట్​ కమలా హారిస్​ అధికారం చేపడతారన్నారు.

"గత రాత్రి జరిగిన సంవాదాన్ని నేను పోటీ కాదని అనుకున్నాను. కమల చాలా భయంకరంగా ఉన్నారు. ఆమె తీరును ఎవరూ ఇష్టపడరు. ఆమె ఓ కమ్యూనిస్ట్. మనకు ఓ కమ్యూనిస్ట్​ ప్రభుత్వం రాబోతోంది. జో బైడెన్​ను స్వయంగా చూసి నేను చెప్తున్నాను.. ఒకవేళ ఆయన గనుక అధ్యక్ష ఎన్నికల్లో గెలిస్తే రెండు నెలలు కూడా అధికారంలో ఉండరు."

-- డొనాల్డ్ ట్రంప్​, అమెరికా అధ్యక్షుడు

సైనిక ఆస్పత్రి నుంచి వచ్చిన అనంతరం.. తొలిసారిగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్​ ఈ వ్యాఖ్యలు చేశారు. బైడెన్, హారిస్ లాగా రిపబ్లికన్​లు అబద్ధం చెబితే.. మీడియా పెద్దఎత్తున విమర్శించేదని ఓ ట్వీట్​లో పేర్కొన్నారు ట్రంప్​. నకిలీ వార్తలను డెమోక్రట్లు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.

'వాళ్లు సరిహద్దును తెరుస్తారు'

ఉపాధ్యక్షుల సంవాదం జరిగిన తర్వాతి రోజు రిపబ్లికన్​ పార్టీ తరఫున ఉపాధ్యక్ష అభ్యర్థి మైక్​ పెన్స్​.. నేవాడాలో జరిగిన ఓ సమావేశంలో పాల్గొన్నారు. ఉపాధ్యక్ష అభ్యర్థుల సంవాదాన్ని... రెండు విధానాల మధ్య జరిగిన చర్చగా ఆయన పేర్కొన్నారు.

"జో బైడెన్​, కమలా హారిస్​లకు అధిక పన్నులు కావాలి. వాళ్లు అమెరికా సరిహద్దులను తెరుస్తారు. పోలీసు వ్యవస్థను నిర్వీర్యం చేస్తారు. సుప్రీం కోర్టునే తమ గుప్పిట్లో ఉంచుకోగలరు. చర్చలో ఎవరు గెలిచారన్న దానిపై టీవీల్లో అనేక కార్యక్రమాలు జరిగాయి. మీరు బైడెన్​- హారిస్​ల అజెండాను.. డొనాల్డ్​ ట్రంప్​ చేసిన విధానాన్ని పోల్చి చూడండి. నిరభ్యంతరంగా ఈ చర్చలో ట్రంప్​ గెలిచారు. "

-- మైక్ పెన్స్​, అమెరికా ఉపాధ్యక్షుడు

ఇదీ చూడండి:కరోనాను జయించి జనంలోకి వస్తోన్న ట్రంప్!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.