ETV Bharat / international

టీకా తీసుకున్నాం.. సేఫ్​గా ఏమేం పనులు చేయొచ్చు​? - అమెరికా కోరనా కేసులు

కరోనా టీకా తీసుకున్న తర్వాత ఎలాగైనా తిరగొచ్చా? ఎవరినైనా కలవొచ్చా? ఇలా అనేక సందేహాలను అమెరికా పౌరులు లేవనెత్తుతున్నారు. ఈ నేపథ్యంలో ఆ దేశ అంటువ్యాధుల నివారణ కేంద్రం పలు సూచనలు చేసింది. టీకా తీసుకున్నా.. మాస్కులు ధరించడం తప్పనిసరని తెలిపింది. అనవసరపు ప్రయాణాలు మానుకోవాలని సూచించింది.

I got the COVID-19 vaccine. What can I safely do?
కరోనా టీకా తీసుకున్నాం.. సేఫ్​గా ఏమేం చేయగలం?
author img

By

Published : Mar 18, 2021, 9:49 PM IST

Updated : Mar 18, 2021, 10:59 PM IST

అమెరికాలో కరోనా టీకా పంపిణీ వేగంగా సాగుతోంది. టీకా తీసుకున్న వారిలో కొందరు తమకు ఇక తిరుగు లేదని భావిస్తోంటే.. ఎంతవరకు భద్రం అని భావించేవారు కొందరున్నారు. ఈ నేపథ్యంలో అమెరికా అంటు వ్యాధుల నివారణ కేంద్రం(సీడీసీ) పలు సూచనలు చేసింది.

  • 'చిన్న చిన్న సమావేశాలకు హాజరవ్వొచ్చు.. వాటిని హాయిగా ఆస్వాదించవచ్చు.. కానీ మాస్కులు ధరించడం, భౌతిక దూరాన్ని కొనసాగించడం మాత్రం తప్పనిసరి'.
  • టీకాలు తీసుకున్న వ్యక్తులు ఇతర వ్యక్తులతో మాస్కులు లేకుండా ఇం​డోర్ హాళ్లలో​ సమావేశం కావొచ్చు.
  • వ్యాక్సిన్​ తీసుకోని వారిని సైతం.. కరోనా ప్రమాదం తక్కువగా ఉందని పరిగణిస్తే ఒకసారి కలుసుకోవచ్చు(టీకా తీసుకున్నవారు).
  • వ్యాక్సిన్​కి సంబంధించి పూర్తి డోసులు తీసుకున్న రెండు వారాల తర్వాత మాత్రమే ఒక వ్యక్తిని పూర్తిగా టీకా తీసుకున్నట్లు పరిగణిస్తారు.
  • టీకాలు తీసుకున్న వ్యక్తుల కార్యకలాపాలపై మార్గదర్శకాలు విడుదల చేసిన సీడీసీ.. అనవసర ప్రయాణాలు మానుకోవాలని సూచించింది. అయితే రెస్టారెంట్లు, ఇతర ప్రదేశాలకు వెళ్లడంపై ఎటువంటి సిఫార్సులు చేయలేదు.

టీకాలు అందుబాటులోకి రావడంతో పాటు.. మహమ్మారి తీవ్రత తగ్గుతోంది. ఈ నేపథ్యంలో దేశంలో మరిన్ని కార్యకలాపాలను అనుమతించడానికి నూతన మార్గదర్శకాలను విడుదల చేయాలని సీడీసీ భావిస్తోంది.

రెండు డోసుల టీకాల్లో మొదటి డోసు తీసుకున్న తర్వాత.. జాగ్రత్తలు పాటించాల్సిందేనని అరిజోనా స్టేట్ యూనివర్సిటీ బయోడిజైన్ ఇనిస్టిట్యూట్ డైరెక్టర్ డాక్టర్ జాషువా లాబెర్ స్పష్టం చేశారు. పాక్షిక రక్షణ ఉన్నప్పుడే వైరస్ వ్యాపించేందుకు మరింత అవకాశం ఉంటుందని ఇందుకు కారణంగా పేర్కొన్నారు.

ఇదీ చదవండి: 'మే 1 నాటికి వయోజనులందరికీ టీకా'​

Last Updated : Mar 18, 2021, 10:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.