ETV Bharat / international

రైస్​ కుక్కర్​తో ఫేస్​ మాస్క్​ల శానిటైజేషన్​!

కరోనా వైరస్​ నుంచి రక్షణ కోసం ఫేస్​మాస్క్​లు పెట్టుకోవడం ఇప్పుడు తప్పని సరిగా మారింది. రోజంతా వాటిని పెట్టుకోవడం వల్ల ఎన్నో కంటికి కనిపించని సూక్ష్మ క్రిములకు అవి ఆవాసాలుగా మారుతున్నాయి. మరి వాటిని కేవలం సబ్బుతో శుభ్రం చేస్తే సరిపోదంటున్నారు శాస్త్రవేత్తలు. మాస్క్​లను శుభ్రం చేసేందుకు ఓ సులభమైన ప్రక్రియను కనుగొన్నారు. ఆదేమిటో మీరూ తెలుసుకోండి మరి!

mask clean types
ఫేస్​మాస్క్ శుభ్రం చేసే పద్ధతులు
author img

By

Published : Aug 10, 2020, 1:04 PM IST

కరోనా సమయంలో ప్రతి ఒక్కరూ ఫేస్​మాస్క్ పెట్టుకోవడం తప్పని సరిగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో రోజూ కొత్త మాస్క్​ పెట్టుకోవడం ఖర్చుతో కూడుకున్న విషయం. అందుకే చాలా మంది పునర్వినియోగ మాస్క్​లను వినియోగిస్తున్నారు. అయితే ఇలాంటి మాస్క్​లను శుభ్రం చేయడం కూడా సవాలుతో కూడుకున్న పని. సబ్బుతో కడిగినా మాస్క్​లు పూర్తిగా శుభ్రం అవుతాయన్న నమ్మకం లేదు.

సులభమైన పద్ధతి..

ఇలాంటి పరిస్థితుల్లో..ఇంట్లో ఉండే ఎలక్ట్రిక్ రైస్​ కుక్కర్​, హీట్​ పాట్​ లాంటివి.. మాస్క్​లను సమర్థంగా శుభ్రం చేయగలవని అమెరికా పరిశోధకులు కనుగొన్నారు. ఎన్​95 మాస్క్​లను 50 నిమిషాలపాటు కుక్కర్​లలో 100 డిగ్రీ సెంటీగ్రేడ్​ వద్ద వేడి చేయడం ద్వారా అవి పూర్తిగా శుభ్రమవుతున్నాయని గుర్తించారు. ఈ పద్ధతి ద్వారా ఎన్​95 మాస్క్​ల ఫిల్టర్​లూ శక్తిమంతంగానే పని చేస్తాయని అంటున్నారు.

ఇల్లినాయీ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు చేసిన ఈ పరిశోధనలో భారతీయ మూలాలున్న ప్రొఫెసర్​ విశాల్ వర్మ కూడా భాగస్వామి.

అనేక పద్ధతులున్నాయి కానీ..

మాస్క్​లను శానిటైజ్​ చేసేందుకు అనేక పద్ధతుల వాడుతున్నారని విశాల్​ వర్మ అన్నారు. అయితే చాలా పద్ధతుల్లో మాస్క్​ల ఫిల్టర్ల దెబ్బతినడం, సామర్థ్యం తగ్గిపోవడం జరుగుతుందని అంటున్నారు. రైస్​కుక్కర్​ ద్వారా చేసే శానిటైజేషన్​తో అలాంటి ఇబ్బందులేవీ ఉండవని స్పష్టం చేశారు. ఈ పద్ధతిలో 20 సార్లు శానిటైజ్ చేయొచ్చని వెల్లడించారు.

ఇదీ చూడండి:కరోనా ఉగ్రరూపస్య: రెండు కోట్లు దాటిన కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.