ETV Bharat / international

అన్నీ తానై బైడెన్ సర్కార్​ను నడిపే నారీశక్తి! - కమలా హారిస్ బైడెన్ యంత్రాంగం

అమెరికా ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన భారత సంతతికి చెందిన కమాలా హారిస్.. బైడెన్ ప్రభుత్వంలో కీలకంగా మారనున్నారు. ఎన్నికైన నాటి నుంచి బైడెన్ తీసుకునే నిర్ణయాల్లో ముఖ్యపాత్ర పోషించారు. పాలన వ్యవహారాల్లోనూ తనదైన ముద్ర వేయనున్నారు. ఉపాధ్యక్ష హోదాలో అన్నీ తానై ముందుండి నడిపించనున్నారు.

kamala harris
కమలా హారిస్
author img

By

Published : Jan 18, 2021, 4:17 PM IST

అమెరికా ఉపాధ్యక్ష పదవిని చేపట్టే తొలి మహిళగా, తొలి నల్లజాతీయురాలిగా, తొలి ఆసియా సంతతి వ్యక్తిగా రికార్డుకెక్కిన కమలా హారిస్.. పాలనా యంత్రాంగంలోనూ ముఖ్య పాత్ర పోషించనున్నారు. అమెరికాలో ప్రస్తుతం నెలకొన్న సవాళ్లను ఎదుర్కోవడంలో కీలకం కానున్నారు. సెనేట్​లో ఇరుపార్టీలకు సమాన ఆధిక్యం ఉన్న నేపథ్యంలో సభాధ్యక్ష హోదాలోనూ కమలనే పాలనా వ్యవహారాలను చక్కబెట్టనున్నారు.

ఇదీ చదవండి: 'నేను శ్యామల కూతుర్ని.. అలా పిలిపించుకుంటేనే నాకు ఆనందం'

ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన హారిస్​కు ఏ పోర్ట్​పోలియోలు కేటాయించే విషయంపై స్పష్టత లేనప్పటికీ.. బైడెన్ చేపట్టే ప్రతి అజెండాలో కమల హస్తం ఉంటుందని ఆమె అధికార ప్రతినిధి సైమోన్ శాండర్స్ పేర్కొన్నారు.

"కొన్ని అంశాల బాధ్యతను బైడెన్.. కమలకే ప్రత్యేకంగా ఇచ్చే అవకాశం ఉంది. వాటిని పక్కనబెడితే ప్రతి విషయంలో ఆమె పాత్ర ఉంటుంది. ప్రతి అంశంలో పాల్గొనే అవకాశం ఉంది. కీలకమైన సమాచారం అందించడం నుంచి అభిప్రాయాలు వెల్లడించే వరకు ఆమెది ప్రధాన పాత్ర. అన్ని విషయాల్లో బైడెన్​కు సహాయంగా ఉంటారు."

-సైమోన్ శాండర్స్, కమలా హారిస్ ప్రతినిధి

అధికార బదిలీలో కమలా పనితనాన్ని గమనించినవారు సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ముందుగానే ఏదో ఒక బాధ్యతను అప్పగించి కమలను ఇతర పాలన వ్యవహారాల నుంచి దూరం చేయడం మంచిది కాదని అభిప్రాయపడుతున్నారు. బైడెన్ యంత్రాంగం ఎదుర్కోబోయే సమస్యలను కలిసికట్టుగా పరిష్కరించాలని చెబుతున్నారు. ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దడం, కరోనాపై పోరు, వాతావరణం, జాతి వివక్షను రూపుమాపడం వంటి సమస్యలపై బైడెన్ యంత్రాంగం ప్రధానంగా దృష్టిసారిస్తోంది. ఈ నాలుగు ప్రాధాన్యాల్లో కమల కీలకంగా వ్యవహరిస్తారని విశ్లేషకులు అంటున్నారు.

"ఈ విషయాలపై ఆమె ముద్ర ఉంటుంది. వీటిపై కమలకు కచ్చితమైన అభిప్రాయం ఉంది. ప్రస్తుతం దేశం క్లిష్ట సమస్యలను ఎదుర్కొంటోంది. వీటిని పరిష్కరించేందుకు అన్ని చేతులు కలవాల్సి ఉంది."

-సైమోన్ శాండర్స్, కమలా హారిస్ ప్రతినిధి

అధ్యక్ష ఎన్నికల్లో గెలుపొందిన తర్వాత బైడెన్ తీసుకున్న ప్రతి నిర్ణయంలో కమలా హారిస్ పోషించిన పాత్ర ఎనలేనిది. వేర్వేరు అంశాలపై నిర్వహించిన కీలక సమావేశాలకు కమల హాజరయ్యారు. కరోనా ఉద్దీపన బిల్లు, భద్రత సమస్యలు సహా క్యాబినెట్​కు ఎవరిని ఎంపిక చేయాలన్న విషయాలపై అనేక సూచనలు అందించారు. అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేయబోయే బైడెన్​తో ప్రతిరోజు సంప్రదింపులు జరుపుతూనే ఉన్నారు. అధికార బదిలీ సహా ఇతర విషయాలపై చర్చించేందుకు ఆయన నివాసం ఉండే డెలావేర్​కు తరచుగా వెళ్తున్నారు.

బైడెన్ ఓటు కమలకే

కీలక విషయాల్లో కమల నిర్ణయానికే బైడెన్ ప్రాధాన్యం ఇస్తారని అధికార బదిలీ ప్రక్రియకు సంబంధం ఉన్న అధికారులు చెబుతున్నారు. సమావేశాల్లో భాగంగా ఏదైనా అంశంపై చర్చించే సమయంలోనూ ముందుగా కమల అభిప్రాయాన్నే తెలుసుకుంటారని వెల్లడించారు.

బైడెన్-ఒబామా బంధంలా..

బైడెన్, హారిస్​కు 2020 ఎన్నికలకు ముందే పరిచయం ఉన్నప్పటికీ... కలిసి పనిచేసిన అనుభవం లేదు. కానీ ఉపాధ్యక్ష అభ్యర్థిగా ఎంపికైన తర్వాత బైడెన్​తో అనుబంధం పెంచుకునేందుకు కమల ప్రయత్నించారని ఆమె సన్నిహితులు చెబుతున్నారు.

ఇదీ చదవండి: కమల వండితే.. అమెరికా ఆహా అంది!

వీరిద్దరి మధ్య ఉన్న అవగాహన.. పాలనాపరమైన సవాళ్లను ఎదుర్కోవడానికి దోహదం చేస్తాయని చరిత్రకారుడు జోయెల్ గోల్డ్​స్టెయిన్ పేర్కొన్నారు.

"అధ్యక్షుడికి, ఉపాధ్యక్షురాలికి మధ్య ఉండే సంబంధం చాలా ముఖ్యమైనది. ఒకరిపై ఒకరు నమ్మకం ఉంచుకోవడం, ఒకరినొకరు అర్థం చేసుకోవడం ఉపాధ్యక్ష పదవిలో విజయం సాధించడానికి చాలా అవసరం. బైడెన్-ఒబామా మధ్య ఉన్న అనుబంధమే బైడెన్-హారిస్​కు దార్శనికం కాగలదు."

-జోయెల్ గోల్డ్​స్టెయిన్, చరిత్రకారుడు

బైడెన్, ఒబామా వేర్వేరు నేపథ్యానికి, తరాలకు చెందినవారైనప్పటికీ.. శ్వేతసౌధంలో కలిసిమెలిసి పనిచేశారు. ఒబామా అధ్యక్షుడిగా పనిచేసినన్ని రోజులు వీరి మధ్య అనుబంధం పెరుగుతూ వచ్చింది. 2009 రికవరీ చట్టం, ఇరాక్ నుంచి దళాల ఉపసంహరణ వంటి కీలక ప్రణాళికల అమలులో బైడెన్​ను ఒబామా పూర్తిగా విశ్వసించారు. హారిస్ సైతం ఇదే పునరావృతం చేయాలని చూస్తున్నట్లు సన్నిహితులు చెబుతున్నారు.

అధ్యక్ష పీఠానికి గురి!

అయితే ఒబామా హయాంలో బైడెన్ మాదిరిగా కాకుండా... హారిస్ తన సొంత రాజకీయ భవిష్యత్తుపైనా ఆలోచించాల్సి ఉంటుందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 78 ఏళ్ల బైడెన్​ను అధ్యక్ష ఎన్నికల్లో మళ్లీ పోటీ చేస్తారా.. పదవీకాలం పూర్తయ్యే సరికి పదవీవిరమణ చేస్తారా అనే ప్రశ్నలను దాటవేశారు. ఈ నేపథ్యంలో 2024 డెమొక్రాట్ల తరఫున అధ్యక్ష అభ్యర్థి బరిలో హారిస్ కచ్చితంగా ఉండే అవకాశం ఉంది. దౌత్యం, ప్రపంచ నేతలతో సంబంధాల విషయంలో బైడెన్ అభిప్రాయాలతో కొంత బేధం ఉన్నప్పటికీ తీసుకునే నిర్ణయాల్లో హారిస్ కీలకంగా మారే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

ఇవీ చదవండి:

టైమ్​ 'పర్సన్​ ఆఫ్​ ద ఇయర్​'గా బైడెన్​-కమల

కమల, ఫౌచీ పేర్లనే తప్పుగా పలికారు!

మన కమలకు రంగవల్లికలతో స్వాగతం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.