ETV Bharat / international

హెచ్​1బీ నిలిపివేతపై అమెరికా చట్టసభ్యులు గరం - H-1B visa suspension will harm American businesses that rely on immigrant workers: US lawmakers

వలస ఉద్యోగులపై తీవ్ర ప్రభావం చూపేలా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న వీసా నిలిపివేత నిర్ణయంపై నిరసన వ్యక్తమవుతోంది. అమెరికా చట్టసభ్యులు ట్రంప్ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దేశ ప్రయోజనాలకు వ్యతిరేకంగా.. సొంత అజెండా కోసమే ఈ ఉత్తర్వులు జారీ చేశారని ఆరోపిస్తున్నారు.

హెచ్​1బీ వీసా రద్దుపై అమెరికా శాసనసభ్యులు గరం!
author img

By

Published : Jun 24, 2020, 1:18 PM IST

హెచ్​1బీ సహా నాన్-ఇమ్మిగ్రెంట్ వీసాలను తాత్కాలికంగా నిలిపివేస్తూ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయంపై అమెరికా చట్టసభ్యుల నుంచి అభ్యంతరం వ్యక్తమవుతోంది. ఈ నిర్ణయం వల్ల ఆసియా నుంచి వచ్చే నైపుణ్య కార్మికులపై అసమాన ప్రభావం పడుతుందని స్పష్టం చేస్తున్నారు. వీరిపై ఆధారపడే అమెరికా వ్యాపారులకు తీవ్ర నష్టం కలుగుతుందని చెబుతున్నారు. రాజకీయ లబ్ది కోసమే ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు మండిపడుతున్నారు.

ఇదీ చదవండి: ట్రంప్​ కీలక నిర్ణయం- హెచ్​-1బీ వీసాల నిలిపివేత

అమెరికాలో ఉన్న హెచ్​1బీ వీసాదారులలో 80 శాతానికి పైగా ఉన్న ఆసియా నైపుణ్య కార్మికులపై ఇది తీవ్ర ప్రభావం చూపుతుంది. ఇది పూర్తిగా పక్షపాతంతో కూడిన మూర్ఖపు అజెండా. దేశ ప్రయోజనాలకు ఇది వ్యతిరేకం.

-జుడీ ఛూ, కాంగ్రెస్​ సభ్యురాలు

అమెరికా ఆర్థిక వ్యవస్థకు ఈ వీసాదారులు చాలా అవసరమని స్పష్టం చేశారు జుడీ. వ్యవసాయం, వైద్య రంగాల్లోనే కాకుండా వ్యాపారం, విద్య వంటి వాటికీ వీరి ఆవశ్యకత చాలా ఉందని నొక్కిచెప్పారు.

కొవిడ్-19 నేపథ్యంలో మన ఆర్థిక వ్యవస్థను తిరిగి నిర్మించాలంటే వలసదారుల దూరం చేసుకోకూడదు. దేశ అవసరాల కంటే తన సొంత ఎన్నికల రాజకీయాలే ప్రధానంగా తీసుకొని అధ్యక్షుడు ఆదేశాలు జారీ చేసినట్లు కనిపిస్తోంది. అమెరికన్ల ఉద్యోగాలను వలసదారులు కొల్లగొడుతున్నారని తప్పుడు భయాలు సృష్టిస్తున్నారు. ద్వేషపూరిత నేరాలు పెరుగుతున్న సమయంలో అధ్యక్షుడి ఉత్తర్వులు వలసదారులను ప్రమాదంలో పడేస్తుంది. పునర్నిర్మాణ సమయంలో ఈ ఉత్తర్వులు దేశాన్ని విభజిస్తాయి. చట్టబద్ధమైన ఇమ్మిగ్రేషన్ వ్యవస్థపై ప్రభుత్వం చేస్తున్న ఈ దాడులను పూర్తిగా ఖండిస్తున్నాను.

-జుడీ ఛూ, కాంగ్రెస్​ సభ్యురాలు

ఇదీ చదవండి: ట్రంప్​ 'వీసా' దెబ్బతో నష్టం ఎవరికి? లాభపడేదెవరు?

వీసా సస్పెన్షన్ ఉత్తర్వులు రాజకీయ కోణంలో తీసుకొచ్చినవేనని కాంగ్రెస్​ సభ్యుడు జేరాల్డ్ నాడ్లర్ ఆరోపించారు. కొవిడ్​-19పై పోరులో ఎదురైన వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మరల్చడానికి అధ్యక్షుడు ట్రంప్ తన అధికారాలను దుర్వినియోగం చేస్తున్నారని ధ్వజమెత్తారు.

ట్రంప్ వలస వ్యతిరేక అజెండా అనైతికం. వలస ఉద్యోగులపై ఆధారపడిన అమెరికా వ్యాపారాలు తీవ్రంగా దెబ్బతింటాయి. ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టకుండా, అమెరికన్లకు సరైన ఉద్యోగాలు కల్పించకుండా.. వలస కార్మికులను లక్ష్యంగా చేసుకొని రాజకీయ కుట్రలు చేస్తున్నారు.

-జేరాల్డ్ నాడ్లర్, కాంగ్రెస్​ సభ్యుడు

అమెరికా దీర్ఘకాల ఆర్థిక ప్రయోజనాలకు ఈ నిర్ణయం తీవ్ర విఘాతం కలిగిస్తుందని కాంగ్రెస్ సభ్యురాలు, డెమొక్రటిక్ నేత అన్నా జీ ఎషూ పేర్కొన్నారు. మందగమనంలో ఉన్న ఆర్థిక వ్యవస్థకు ఇది హానికరమని వ్యాఖ్యానించారు.

ఆవిష్కరణల్లో ప్రపంచాన్ని నడిపించే సిలికాన్ వ్యాలీకి నేను ప్రతినిధిని. ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి ముగ్గురిలో ఒకరు అమెరికా వెలుపల జన్మించిన వారే. అమెరికా విజయానికి వారందరూ చాలా అవసరం.

-అన్నా జీ ఎషూ, డెమొక్రటిక్ నేత

ఉద్యోగులతో పాటు పరిశోధకులు, స్కాలర్లుపైనా ఈ నిర్ణయం ప్రతికూల ప్రభావం చూపుతుందని చట్టసభ్యుడు ఫిలెమోన్ వెలా అన్నారు.

మొత్తం గ్రీన్ కార్డ్ హోల్డర్లలో టెక్సాస్​లోనే 10 శాతం మంది ఉన్నారు. ఈ నిర్ణయం వల్ల న్యూయార్క్ తర్వాత తీవ్రంగా ప్రభావితమయ్యేది టెక్సాస్ రాష్ట్రమే. అమెరికా వైవిధ్యమైన ఆస్తిని దెబ్బతీయడమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న నైపుణ్యాన్ని ఆకర్షించడానికి ఈ నిర్ణయం అడ్డుపడుతుంది.

-ఫిలెమోన్ వెలా, కాంగ్రెస్ సభ్యుడు

ట్రంపే కరెక్ట్!

మరోవైపు కాంగ్రెస్ సభ్యుడు, రిపబ్లికన్ నేత మో బ్రూక్స్ మాత్రం అధ్యక్షుడి నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేశారు. దేశంలో నిరుద్యోగ కుటుంబాలు తీవ్రంగా నష్టపోతున్నాయని పేర్కొన్నారు. దేశంలో 4.5 కోట్లమంది నిరుద్యోగులు ఉండగా విదేశాల నుంచి ఉద్యోగులను దిగుమతి చేసుకోవడం అనవసరమని మరో సభ్యుడు లాన్సె గూడెన్ అభిప్రాయం వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి: ట్రంప్ దెబ్బ.. ఏ వీసాపై ఎలాంటి ప్రభావం?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.