భవిష్యత్‌లో టీకాలు వేయించుకోవడం(Covid vaccine) సలాడ్ తిన్నంత సులువు కాబోతోంది. లెటూస్ వంటి మొక్కలను ఎంఆర్‌ఎన్‌ఏ (Messenger RNA) వ్యాక్సిన్ కర్మాగారాలుగా మార్చే సరికొత్త విధానంపై అమెరికాలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు పరిశోధన చేస్తున్నారు. మెసెంజర్ ఆర్‌ఎన్‌ఏ (ఎంఆర్‌ఎన్‌ఏ)(Messenger RNA) పరిజ్ఞానంతో కొన్ని కొవిడ్-19 టీకాలు(Covid-19 vaccines) తయారైన సంగతి తెలిసిందే. అవి అంటువ్యాధులను కలిగించే వైరస్‌లను గుర్తించి, వాటి నుంచి రక్షణ కల్పించేలా మన కణాలకు శిక్షణ ఇస్తాయి. ఈ వ్యాక్సిన్లను శీతల ఉష్ణోగ్రతలో ఉంచాలి. అదే ఈ సాంకేతికతలో ఉన్న అతిపెద్ద సవాల్. అమెరికా శాస్త్రవేత్తల పరిశోధన ఫలిస్తే మొక్కల ఆధారిత ఎంఆర్‌ఎన్‌ఏ టీకాలు వస్తాయి. వాటిని నేరుగా తినేయవచ్చు. వాటిని శీతల వాతావరణంలో భద్రపరచాల్సిన అవసరం తప్పుతుంది. మొక్కల కణాల్లోని భాగానికి ఎంఆర్‌ఎన్‌ఏ టీకాలు కలిగిన డీఎన్‌ఏను చేరవేసి, అక్కడ వాటి సంఖ్యను పెంచడం ఈ ప్రయోగం ఉద్దేశం.
''సంప్రదాయ టీకా స్థాయిలో ఎంఆర్‌ఎన్‌ఏ (Messenger RNA) వ్యాక్సిన్‌ను మొక్కలు ఉత్పత్తి చేయగలవు. ఒక వ్యక్తికి సరిపడా ఎంఆర్‌ఎన్‌ఏను ఒక మొక్క ఉత్పత్తి చేయగలదు. దీన్ని రుజువు చేసే ప్రయోగాలు కొనసాగుతున్నాయి.'' అని పరిశోధనకు నాయకత్వం వహిస్తున్న జువాన్ పాబ్లో గిరాల్డో చెప్పారు.
మొక్కల కణాల్లోని క్లోరోప్లాస్ట్‌లు ఇందులో కీలక పాత్ర పోషించనున్నాయి. సూర్యకాంతిని మొక్కలకు అవసరమైన శక్తిగా మార్చడం వీటి ప్రధాన విధి. వీటి సాయంతో అనేక ఇతర పదార్థాలనూ తయారుచేయవచ్చని గిరాల్డో చెప్పారు. మొక్కలతో సంబంధం లేని జన్యువులనూ వ్యక్తీకరించే సామర్థ్యం క్లోరోప్లాస్ట్‌లకు ఉందని తాము ఇప్పటికే రుజువు చేశామన్నారు.
ఇవీ చూడండి: ఏ పని చేస్తే ఎక్కువ కాలం బతుకుతారో తెలుసా?
రోగులకు మందుల్లేవు.. వైద్యులకు జీతాలు రావు.. తాలిబన్లతో ఎన్ని కష్టాలో...