ETV Bharat / international

'ట్రంప్​' యాప్​.. గూగుల్​ నుంచి ఔట్​ - ట్రంప్ ప్రచార యాప్​ 2020

అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారం కోసం గతేడాది.. ఆ దేశ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ తీసుకువచ్చిన ఓ యాప్​పై గూగుల్ వేటు వేసింది. తమ​ విధానాలను ఈ యాప్​ పాటించనందున ప్లేస్టోర్​ నుంచి తొలగించింది.

Google removes Trump's campaign app from Play Store
'ట్రంప్​' యాప్​.. గూగుల్​ నుంచి ఔట్​
author img

By

Published : Feb 18, 2021, 8:05 PM IST

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​నకు చెందిన 2020 అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచార యాప్​ను ప్లే స్టోర్​ నుంచి గూగుల్​ తొలగించింది. తమ విధానాలను ఈ యాప్​ ఉల్లంఘించినందున గూగుల్​​ ఈ నిర్ణయం తీసుకుంది.

యాప్​ లోడ్​ కావట్లేదని, అందులోని సమాచారం తొలగిపోయినట్లు ఆండ్రాయిడ్​ పోలీసులు గుర్తించారు. దాంతో ఈ యాప్​పై గూగుల్​ వేటు వేసింది. గతేడాది నవంబర్​లో ఈ యాప్​ను ఆండ్రాయిడ్​, ఐఓఎస్​ వేదికల్లో అందుబాటులోకి తీసుకువచ్చారు. కానీ, ఇప్పటివరకు ఎలాంటి అప్​డేట్లు చేయలేదు. అక్టోబర్​ 30 నుంచి ప్లే స్టోర్​ వెర్షన్​ అప్​డేట్​ కాలేదు.

"ట్రంప్​ 2020 క్యాంపెయిన్​ యాప్​ ఇటీవల పని చేయడం ఆగిపోయింది. ఈ విషయాన్ని యాప్​ డెవలపర్​ల దృష్టికి అనేక సార్లు తీసుకెళ్లాం. గూగుల్​ ప్లేస్టోర్​ నుంచి డౌన్​లోడ్​ చేసుకునే యాప్​లు కనీస స్థాయిలోనైనా.. పని చేస్తాయని ప్రజలు నమ్ముతారు. పని చేయని వాటిని ప్లే స్టోర్​ నుంచి తొలగిస్తాం."

-గూగుల్ ప్రతినిధి

ఐఓఎస్​ వెర్షన్​లో ఈ యాప్​ లోడ్ అవుతున్నందున.. ఆపిల్​ కంపెనీ ఈ యాప్​ను తొలగించలేదని తెలుస్తోంది.

ఇదీ చదవండి:'అమెరికాకు భారత్​ కీలక రక్షణ భాగస్వామి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.