జాతి వివక్షపై పోరాటానికి ప్రముఖ సాంకేతిక దిగ్గజ సంస్థ గూగుల్ బాసటగా నిలిచింది. 37 మిలియన్ అమెరికన్ డాలర్ల సాయాన్ని ప్రకటించింది. ఈ మేరకు.. గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ వెల్లడించారు. జాతి అసమానతలను రూపుమాపేందుకు కృషి చేస్తున్న సంస్థలకు 12 మిలియన్ డాలర్లు, జాత్యాంహకారంతో అన్యాయానికి గురతున్న వారి తరుఫున పోరాడుతున్న సంస్థలకు 25 మిలియన్ డాలర్లను అందజేయనున్నట్లు తెలిపారు.
ఇదే సమయంలో అమరులైన నల్లజాతీయులను స్మరిస్తూ ఎనిమిది నిమిషాల 46 సెకన్లపాటు మౌనం పాటించాలని ఉద్యోగులందరికీ బుధవారం మెయిల్ పంపింది గూగుల్. ఆఫ్రో అమెరికన్ జార్జ్ ఫ్లాయిడ్ హత్యను నిరసిస్తూ అమెరికాలో ఆందోళనలు చెలరేగుతున్న వేళ గూగుల్ ఈ నిర్ణయం తీసుకుంది.
ఇదీ చూడండి:గుజరాత్లో కాంగ్రెస్కు షాక్... ఇద్దరు ఎమ్మెల్యేలు రాజీనామా