ETV Bharat / international

ఆ దేశంలో టీకా కేంద్రాలుగా గూగుల్​ ఆఫీసులు - గూగుల్​ కరోనా వ్యాక్సిన్​

అమెరికాలో జరుగుతోన్న టీకా పంపిణీ కార్యక్రమంలో ప్రముఖ టెక్​ దిగ్గజం గూగుల్​ భాగం కానుంది. సొంత భవనాలను వ్యాక్సినేషన్​ కేంద్రాలుగా అందుబాటులోకి తీసుకురానుంది.

Google opening up its spaces in US to serve as mass COVID-19 vaccination sites: Sundar Pichai
'గూగుల్​ స్పెసెస్​' వ్యాక్సినేషన్​ కేంద్రాల గుర్తింపు
author img

By

Published : Jan 25, 2021, 7:18 PM IST

ప్రపంచ వ్యాప్తంగా జరుగుతోన్న కరోనా టీకా పంపిణీ కార్యక్రమంలో ప్రముఖ టెక్​ దిగ్గజం గూగుల్​ భాగం కానుంది. కొవిడ్​ కారణంగా ఇప్పటికే ఆ సంస్థ ఉద్యోగులు 'వర్క్​ ఫ్రమ్​ హోమ్​' పద్ధతిన పని చేస్తున్నారు. ఈ క్రమంలో పాక్షికంగా తెరిచి ఉంచిన ఆఫీసులను టీకా పంపిణీ కేంద్రాలుగా మార్చి అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఆ సంస్థ ముఖ్య కార్యనిర్వహణాధికారి సుందర్​ పిచాయ్​ తెలిపారు. టీకా పంపిణీపై అవగాహన కల్పించేందుకు సుమారు రూ. వేయి కోట్లకు పైగా ఖర్చు చేయనున్నట్లు పేర్కొన్నారు. అయితే ఈ నిర్ణయం ప్రస్తుతానికి అమెరికాకు మాత్రమే పరిమితం అవుతుందని చెప్పారు సుందర్.

"అమెరికావ్యాప్తంగా కరోనా టీకా పంపిణీ కోసం గూగుల్​ ఆఫీసులను ఉపయోగించే వీలు కల్పిస్తున్నాం. వీటి ద్వారా టీకా పంపిణీ కార్యక్రమం మరింత సులభతరం కానుంది. ఎప్పుడు, ఎక్కడ, వ్యాక్సిన్ తీసుకోవచ్చు అనే సమాచారాన్ని వినియోగదారుల కచ్చితంగా తెలుసుకోవచ్చు. ఈ దశలో టీకాపై అవగాహన కల్పించడానికి, సమానమైన పంపిణీని ప్రోత్సహించడానికి సుమారు రూ. 1000 కోట్లు ఖర్చు చేసేందుకు సంస్థ సిద్ధంగా ఉంది. "

-సుందర్​ పిచాయ్​, గూగుల్ సీఈఓ

'నా దగ్గరలో వ్యాక్సినేషన్ కేంద్రం ఎక్కడ ఉంది'?​ అని వెతికే వారి సంఖ్య అమెరికాలో అయిదు రెట్లు పెరిగినట్లు పిచాయ్​ తెలిపారు. ఇలా గూగుల్​ను అడిగిన వారికి వీలైనంత తక్కువ సమయంలో తాము కచ్చితమైన, సమాచారాన్ని ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని పేర్కొన్నారు. ఈ క్రమంలో వీలైనంత ఎక్కువమందికి టీకా అందించే దిశగా చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. స్థానిక ప్రభుత్వాల మార్గదర్శకాలను అనుసరించి అర్హత ఉన్న వారికి టీకా అందజేసేందుకు ఈ నిర్ణయం తోడ్పడుతుందని వివరించారు.

టీకా పంపిణీకి అనువుగా ఉండే భవనాలను, పార్కింగ్​ స్థలాలను, బహిరంగ ప్రదేశాలను గూగుల్​ గుర్తించనుంది. ఇందుకోసం ఆరోగ్య శాఖ అధికారులతో కలిసి పనిచేయనుంది. ఈ కార్యక్రమాన్ని లాస్​ ఏంజెల్స్​, కాలిఫోర్నియా, శాన్​ఫ్రాన్సిస్కోలో ప్రారంభించి.. వాషింగ్టన్​, న్యూయార్క్​ సహా అమెరికా అంతటా విస్తరించేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు పిచాయ్​ వివరించారు.

మరికొన్ని వారాల్లోనే కరోనా వ్యాక్సినేషన్ కేంద్రాలను గూగుల్ సెర్చ్​, మ్యాప్స్​లలో అందుబాటులోకి తీసుకురానున్నట్లు పిచాయ్​ వెల్లడించారు.

అమెరికాలో ఇప్పటి వరకు 2.5 కోట్ల మందికి పైగా కరోనా సోకింది. మరణాలు 4 లక్షలు దాటాయి.

ఇదీ చూడండి: కొవిడ్​ టీకా తొలి డోసు తీసుకున్న బిల్​గేట్స్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.