ప్రపంచవ్యాప్తంగా కొవిడ్-19 బారినపడుతున్న వారి సంఖ్య రోజురోజుకు భారీగా పెరుగుతోంది. ఇప్పటివరకు 73 లక్షల 18 వేల 124 మందికి వైరస్ సోకింది. 4,13,648 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం 36,02,580 మంది వైరస్ నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు.
అమెరికాలో వైరస్ ఉద్ధృతి కొనసాగుతోంది. మొత్తం కేసుల సంఖ్య 2,045,549కి చేరింది. 1,14,148 మంది ప్రాణాలు కోల్పోయారు. 788,862 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 1,142, 539 మంది ఆస్పత్రులు, వైద్య శిబిరాల్లో చికిత్స పొందుతున్నారు.
బ్రెజిల్లో..
అమెరికా తర్వాత కేసుల సంఖ్యలో రెండో స్థానంలో ఉన్న బ్రెజిల్లోనూ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఇప్పటి వరకు 7,42,084 మంది వైరస్ బారిన పడ్డారు. 38,497 మంది మృతి చెందారు. 325,602 మంది వైరస్ బారి నుంచి బయటపడ్డారు.
రష్యాలో..
రష్యాలోనూ వైరస్ విజృంభణ కొనసాగుతోంది. మొత్తం కేసుల సంఖ్య 4,85,253కు చేరింది. 6,142మంది ప్రాణాలు కోల్పోయారు. 2,42,397 మంది వైరస్ నుంచి కోలుకున్నారు.
బ్రిటన్లో..
బ్రిటన్లో కరోనా కేసుల సంఖ్య 2,89, 140కి చేరింది. వైరస్ కారణంగా 40,883 మంది మరణించారు.
స్పెయిన్..
కేసుల సంఖ్యలో ఐదో స్థానంలో ఉన్న స్పెయిన్లో కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఇప్పటి వరకు మొత్తం 289, 046 మంది వైరస్ బారినపడ్డారు. 27, 136 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఇదీ చూడండి: జులై ఆఖరుకు దేశంలో 10 లక్షల కేసులు