ETV Bharat / international

ప్రపంచంపై కరోనా పంజా.. ఒక్కరోజులో 47వేలమందికి వైరస్

ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి కరాళ నృత్యం చేస్తోంది. ఇప్పటివరకు 67లక్షల 40వేల మంది ఈ వైరస్​ బారిన పడ్డారు. మృతుల సంఖ్య 4లక్షలకు చేరువైంది. ఇప్పటివరకు 32లక్షల 73 వేలమంది వైరస్​ నుంచి విముక్తి పొందారు.

world corona
ప్రపంచంపై కరోనా పంజా
author img

By

Published : Jun 5, 2020, 8:29 PM IST

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ ఉద్ధృతి కొనసాగుతోంది. వివిధ దేశాలు లాక్​డౌన్​ ఆంక్షలు సడలిస్తున్న నేపథ్యంలో రోజురోజుకు కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఒక్క రోజులోనే 47వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు 67 లక్షల 40వేల మందికి వైరస్ సోకింది. మృతుల సంఖ్య 3లక్షల 94 వేలకు చేరువైంది. అయితే కొవిడ్​-19 నుంచి ఇప్పటివరకు 32లక్షల 74 వేలమంది కోలుకున్నారు.

అమెరికాలో కొత్తగా 2,218 పాజిటివ్​ కేసులు నిర్ధరణ అయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 19లక్షల 26వేలకు పైగా ఉంది. లక్షా 10వేల మందికి పైగా వైరస్​కు బలయ్యారు. బ్రెజిల్​లో కొత్తగా 2,600 వైరస్ కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 6లక్షల18 వేలు దాటింది. మొత్తంగా 34వేల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. పాకిస్థాన్​లో మరో 4,000 మందికి వైరస్ నిర్ధరణ అయింది.

world corona
ప్రపంచంలో కరోనా గణాంకాలు

ఇదీ చూడండి: లాక్​డౌన్​తో పిల్లల్లో ఊబకాయం మరింత తీవ్రం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.