ETV Bharat / international

పెట్రోల్​ ట్యాంకర్ పేలి 50మంది దుర్మరణం - హైతీ పెట్రోల్​ ట్యాంకర్​ పేలుడు

Petrol tanker blast: హైతీలో ఓ పెట్రోల్​ ట్యాంకర్ పేలిన ఘటనలో 50మంది మరణించారు. అనేక మంది తీవ్రంగా గాయపడి ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది.

Haiti
పెట్రోల్​ ట్రక్కు పేలి 40మంది దుర్మరణం
author img

By

Published : Dec 14, 2021, 6:27 PM IST

Updated : Dec 14, 2021, 7:58 PM IST

Petrol tanker blast: ఉత్తర హైతీలో ఘోర ప్రమాదం జరిగింది. కేప్​-హైతియన్​లో​ పెట్రోల్​ తీసుకెళుతున్న ఓ ట్యాంకర్ పేలి.. 50మంది దుర్మరణం పాలయ్యారు. అనేక మంది గాయాలతో ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని సమాచారం.

ఈ ఘటనపై ఆ దేశ ప్రధాని ఏరియల్​ హెన్రీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మూడు రోజులు సంతాప దినాలు ప్రకటించారు.

ఇలా జరిగింది..!

ఈ ప్రమాదం స్థానిక కాలమానం ప్రకారం సోమవారం అర్ధరాత్రి 1 గంటకు జరిగినట్టు తెలుస్తోంది. "ఓ ట్యాక్సీని ఢీకొట్టే ప్రమాదం నుంచి తప్పించుకునే క్రమంలో.. ట్యాంకర్​ నడుపుతున్న డ్రైవర్​.. వాహనంపై పట్టుకోల్పోయినట్టు తెలుస్తోంది. దీంతో ట్యాంకర్​ బోల్తా కొట్టింది. అందులో నుంచి పెట్రోల్​ లీక్​ అవ్వడం మొదలైంది. దీంతో స్థానికులు పెట్రోల్​ను తీసుకునేందుకు బకెట్లతో ఎగబడ్డారు. ఈ సమయంలోనే పేలుడు సంభవించి ఉండొచ్చు," అని కేప్​ హైతియన్​ డిప్యూటీ మేయర్​ తెలిపారు. మంటల్లో అనేకమంది సజీవదహనం అయ్యారని పేర్కొన్నారు. పేలుడు ధాటికి మంటలు స్థానిక ఇళ్లకు కూడా వ్యాపించాయని స్పష్టం చేశారు.

హైతీ దేశం తీవ్ర పెట్రోల్​ సంక్షోభంలో కూరుకుపోయింది. పెట్రోల్​ కొరతతో ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ క్రమంలోనే పెట్రోల్​ దొరికితే.. ప్రజలు ఎగబడుతున్న ఘటనలు ఇటీవలి కాలంలో చాలా జరుగుతున్నాయి. ఇవి ఘోర ప్రమాదాలకు దారితీస్తున్నాయి.

ఇదీ చూడండి:- పోలీసుల నుంచి తప్పించుకోబోయి వ్యాన్ బోల్తా- ఏడుగురు మృతి

Last Updated : Dec 14, 2021, 7:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.