అమెరికా టెక్సాస్‌లో హత్యకు గురైన సిక్కు పోలీసు అధికారి సందీప్ ధాలివాల్‌కు సహోద్యోగులు, సన్నిహితులు, హ్యూస్టన్ వాసులు ఘన నివాళులు అర్పించారు. భారత సంతతికి చెందిన సందీప్ విధులు నిర్వహిస్తున్న సమయంలో ఎప్పుడూ నిజాయితీగా వ్యవహరించేవారని కొనియాడారు.
సందీప్ మృతదేహానికి అక్టోబర్ 2న అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
హ్యూస్టన్‌లో హారీస్ కౌంటీ డిప్యూటీ షెరీఫ్గా పదేళ్ల నుంచి విధులు నిర్వర్తిస్తున్నారు 42 ఏళ్ల సందీప్ ధాలివాల్. శనివారం ఓ ఉన్మాది కాల్పుల్లో మరణించారు. ఈ దారుణానికి పాల్పడిన రాబర్టోలిస్ అనే నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు.
ఇదీ చూడండి:పడవలోని ఆ 34 మంది అగ్నికి ఆహుతయ్యారు