తప్పిపోయిన కుక్క ఏడేళ్ల తర్వాత దొరికిన విచిత్ర సంఘటన అమెరికా ఫ్లోరిడాలోని యార్క్‌షైర్‌లో జరిగింది. టెర్రియర్ మిక్స్ బ్రీడ్‌కు చెందిన పెప్పర్ అనే పెంపుడు కుక్క 2014లో తప్పిపోయింది. దాని యజమానురాలు కుక్కను వెతికి పెట్టమని పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. ఎంత వెతికినా ఆ కుక్కజాడ కనిపించలేదు. ఇక అది దొరకదనుకుంటున్న తరుణంలో ఓ అద్భుతం జరిగింది.
ఆ తప్పిపోయిన కుక్క ఏడేళ్ల తర్వాత ఫ్లోరిడాకు 1,600 కిలో మీటర్ల దూరంలో ఉన్న మిచిగాన్ రాష్ట్రం ఈటన్ కౌంటీ యానిమల్ కంట్రోల్ డిపార్ట్‌మెంట్‌కు దొరికింది. ఈ విషయాన్ని అసలు యజమానురాలికి తెలియజేయగానే ఆమె ఫ్లోరిడా నుంచి మిచిగాన్‌కు ఫ్లైట్‌లో వెళ్లి తన కుక్కను కలుసుకుని, ముద్దాడారు. అయితే ఆ కుక్క అంతదూరం ఎలా ప్రయాణించి మిచిగాన్‌లోని ఛార్లోట్‌కు చేరుకుందో తమకు అంతు చిక్కడం లేదని అధికారులు అంటున్నారు.
మైక్రోచిప్ అమర్చడం వల్లనే సాధ్యం!
పెంపుడు జంతువులకు మైక్రోచిప్ అమర్చి ఉండటం వల్లనే దాని యజమానిని గుర్తించడం సులువవుతుంది. గత ఏడాది ఫిబ్రవరిలో ఆ కుక్క యజమానురాలు అప్‌డేట్ చేసిన వివరాలు మైక్రోచిప్‌లో లభ్యం అయ్యాయి. దాంతో అది దొరికిన కొన్ని నిమిషాల్లోనే ఆవిడకి ఫోన్ చేశామని అధికారులు చెప్పారు. అది గత ఐదేళ్లుగా ఒక కుటుంబంతో ఉంటోంది. వారికి అది తప్పిపోయిన కుక్క అనిగానీ, దానికి మైక్రోచిప్ అమర్చారనిగానీ ఏమాత్రం తెలియదట.
పెంపుడు జంతువులకు మైక్రోచిప్ అమర్చడం, మీ తాజా చిరునామా తదితర వివరాలను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేస్తుండటం ఎంతో అసవరమని ఈటన్ కౌంటీ యానిమల్ కంట్రోల్ డిపార్ట్‌మెంట్‌వారు చెబుతున్నారు.
ఇదీ చూడండి: అద్దెకు 'బాల్కనీ'- గంటకు రూ.1800!
ఇదీ చూడండి: 'హాట్‌డాగ్' తిండిబోతు టైటిల్ మళ్లీ జోయికే